విజయ్-స్టాలిన్ భేటీపై కాంగ్రెస్ రియాక్షన్ ఇదే..! కీలక వ్యాఖ్యలు..!

తమిళనాడులో ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైనా.. ఎట్టకేలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్ .. ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విలువనిస్తూ మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలవాలని నిర్ణయించారు. అనంతరం ఆయన మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లి కలిశారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమికి చెప్పపెట్టకుండా గుడ్ బై చెప్పేసి విజయ్ శిబిరంలో చేరిపోయిన కాంగ్రెస్ పార్టీ (Congress) స్పందించింది.

విజయ్-స్టాలిన్ భేటీ (vijay-stalin meet) ఖరారైందన్న సమాచారం తర్వాత కాంగ్రెస్ కు చెందిన విరుదునగర్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ సీఎం నిర్ణయంపై స్పందించారు. తమిళనాడు ముఖ్యమంత్రి తిరు విజయ్, మాజీ ముఖ్యమంత్రి తిరు ఎం.కె. స్టాలిన్‌ను కలవడం చాలా హుందాగా, పరిణతితో కూడిన రాజకీయ సంజ్ఞ అని ఆయన వ్యాఖ్యానించారు. పోటీకి అతీతంగా గౌరవాన్ని, అధికారానికి అతీతంగా హుందాతనాన్ని ప్రజలు ఆశించే రాజకీయాలు ఇవి అని పేర్కొన్నారు.

Congress Hails Tamil Nadu CM Vijay s Visit to MK Stalin as a Masterclass in Democratic Maturity

నాయకులు ద్వేషానికి బదులుగా సౌజన్యాన్ని, విభజనకు బదులుగా సంభాషణను ఎంచుకున్నప్పుడే మార్పు శకం మొదలవుతుందని మాణిక్కం ఠాకూర్ తెలిపారు. ప్రజాస్వామ్య సంస్కృతి ఎలా పనిచేయాలో తమిళనాడు భారతదేశానికి నిరూపిస్తూనే ఉందన్నారు. తద్వారా ఎన్నికల్లో స్టాలిన్ తో కలిసి పోటీ చేసిన తాము విజయ్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నా .. ఆ నిర్ణయం ప్రభావాన్ని మనసులో పెట్టుకోకుండా రాజకీయాలకు అతీతంగానే వ్యవహరిస్తామని తేల్చిచెప్పినట్లయింది. ఇప్పటికే పలువురు విజయ్-స్టాలిన్ భేటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+