వంట గ్యాస్ సరఫరా పై కస్టమర్లకు ఆయిల్ కంపెనీల బిగ్ అలర్ట్..!!
వంట గ్యాస్ సరఫరా సమస్యలు పూర్తిగా తొలిగి పోలేదు. కమర్షియల్ ధరలు భారీగా పెంచిన ఆయల్ కంపెనీలు.. డొమెస్టిక్ వినియోగ సిలిండర్ల ధరల పెంపు పైనా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు అందించాయి. కేంద్రం ఆమోదిస్తే పెంపు కోసం సిద్దంగా ఉన్నాయి. ఇదే సమయంలో వంట గ్యాస్ కొరత ను కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో.. ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు బిగ్ అలర్ట్ జారీ చేసాయి. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి.
వంట గ్యాస్ సరఫరా పేరుతో కొందరు వినియోగదారులకు మోసాల బారిన పడుతున్నారు. వంట గ్యాస్ కొరత గతం కంటే మెరుగైనా.. పూర్తిగా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో.. కొందరు దీనిని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. హిందుస్థాన్ పెట్రోలియం(HPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం(BPCL) వంటి కంపెనీలు వినియోగదారులను అప్రమత్తం చేశాయి. గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో నకిలీ ఎస్ఎమ్ఎస్‌లు, వాట్సాప్ సందేశాలు పంపిస్తూ కేటుగాళ్లు కస్టమర్ల నుంచి ఓటీపీ, డీఏసీ(డెలివరీ అథంటికేషన్ కోడ్)ల ద్వారా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించాయి. ఇటీవలి కాలంలో.. సైబర్ నేరగాళ్లు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులుగా పరిచయం చేసుకుంటూ కస్టమర్లకు ఫోన్ చేస్తున్నారు.

వినియోగదారులకు సూచనలు
వినియోగదారులను.. 'కేవైసీ అప్డేట్ చేయాలి, ఆధార్ లింక్ చేయాలి.. లేదంటే కనెక్షన్ నిలిపివేస్తాం' లాంటి మాటలతో ఓటీపీలు అడుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరికి అఫీషియల్ ఎల్‌పీజీ డెలివరీ మెసేజ్లలాగే ఫేక్ సందేశాలు పంపి, అందులోని కోడ్‌ను చెప్పాలని అడుగుతున్ నారని చమురు సంస్థలు తెలిపాయి. అధికారిక డెలివరీ మెసేజ్‌లు ఎల్లప్పుడూ ఆయా కంపెనీల గుర్తింపు పేరుతోనే వస్తాయని వెల్లడించాయి. అందులో 4 అంకెల ఓటీపీ మాత్రమే ఉంటుందని పేర్కొన్నాయి. ఆ కోడ్ కేవలం సిలిండర్ డెలివరీ సమయంలో సంబంధిత సిబ్బందికే చెప్పాలని స్పష్టం చేశాయి. ఫోన్ కాల్స్, వాట్సాప్ లేదా ఇతర అనుమానాస్పద లింక్‌ల ద్వారా ఎవరు ఓటీపీ అడిగినా స్పందించొద్దని సూచించాయి. అయితే.. ఆయా వినియోగదారులు అధికారిక యాప్, వెబ్‌సైట్‌ల ద్వారానే గ్యాస్ బుకింగ్, కేవైసీ అప్డేట్ చేయాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత మొబైల్ నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ సందేశాలు, అనుమానాస్పద లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఈ తరహా మోసాలకు గురైనట్టయితే.. వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలన్నారు.













Click it and Unblock the Notifications