మొదటి సినిమాకు రూ.లక్ష: ఇప్పుడు రూ.వేల కోట్లకు అధిపతి అయిన హీరోయిన్
సినిమా గ్లామర్ ప్రపంచంలో ఒక హీరోయిన్ తన కెరీర్ మొదట్లో లక్ష రూపాయల పారితోషికంతో ప్రయాణాన్ని ప్రారంభించి, ఇప్పుడు ఏకంగా 10 వేల కోట్ల సామ్రాజ్యానికి రాణిగా మారింది. కేరళకు చెందిన అసిన్ థోట్టుంకల్ చాలా చిన్న వయసులోనే వెండితెరపై మెరిసింది. తెలుగులో రవితేజ సరసన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా అసిన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే, ఆ సినిమాకు ఆమె అందుకున్న పారితోషికం కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు.
స్టార్ హీరోల ఆస్థాన హీరోయిన్
తెలుగులో శివమణి, ఘర్షణ, లక్ష్మీ నరసింహ వంటి హిట్స్ కొట్టిన అసిన్, తమిళంలో రజనీకాంత్ తప్ప దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. ముఖ్యంగా సూర్యతో చేసిన 'గజినీ' సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ సినిమా హిందీ రీమేక్‌లో అమీర్ ఖాన్ సరసన నటించి బాలీవుడ్ ఎంట్రీని కూడా గ్రాండ్‌గా ఇచ్చింది. అసిన్ కెరీర్ నిర్ణయాల్లో ఆమె తండ్రి జోసెఫ్ థోట్టుంకల్ పాత్ర చాలా కీలకమైనది.

అసిన్ బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న సమయంలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఆమెకు వ్యాపారవేత్త రాహుల్ శర్మను పరిచయం చేశారు. రాహుల్ శర్మ మరెవరో కాదు, మొబైల్ దిగ్గజ సంస్థ 'మైక్రోమ్యాక్స్' సహ వ్యవస్థాపకుడు. మొదట సాధారణ స్నేహంగా ప్రారంభమైన వీరి పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారి 2016లో పెళ్లి పీటల దాకా వెళ్ళింది. రాహుల్ శర్మ ఎదుగుదల చూసి అసిన్ ముగ్ధురాలైందని, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ వెంటనే కుదిరిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
10 వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి
పెళ్లి తర్వాత అసిన్ వెండితెరకు పూర్తిగా గుడ్ బై చెప్పింది. గ్లామర్ ప్రపంచం కంటే ఫ్యామిలీ లైఫ్‌కే ఆమె ప్రాధాన్యత ఇచ్చింది. ప్రస్తుతం అసిన్ తన భర్త, కూతురుతో కలిసి అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. రాహుల్ శర్మ ఆస్తుల విలువ 10 వేల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. సినిమా ఇండస్ట్రీలో ఎంత సంపాదించినా రాని అరుదైన హోదాను, సంపదను ఆమె తన వైవాహిక జీవితం ద్వారా అందుకుంది. కొద్దిరోజుల క్రితం అసిన్ దంపతులు విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్లు వచ్చాయి. దీనిపై అసిన్ వెంటనే స్పందిస్తూ.. తాము చాలా సంతోషంగా ఉన్నామని, ఇవన్నీ నిరాధారమైన వార్తలని కొట్టిపారేసింది.












Click it and Unblock the Notifications