'కాంచన 4' బిగ్ అప్డేట్..ఇదే చివరి సినిమా.. థియేటర్లు బద్దలే..!
ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు లాఘవ లారెన్స్ అటు సినిమాలతో పాటు తన సేవా కార్యక్రమాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు లాఘవ లారెన్స్. ముని(కాంచన), కాంచన 2, గంగ(కాంచన 3), ఇప్పుడు కాంచన 4 లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని భయపెడుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ హారర్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇటీవల రీ రిలీజైన కాంచన 2, గంగ సినిమాలు సైతం భారీగా కలెక్షన్స్ ను రాబట్టాయి. ఈ క్రమంలో తాజాగా రాఘవ లారెన్స్ తన ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.

ఇక ప్రస్తుతం రాఘవ లారెన్స్ కాంచన 4 పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కాంచన ఫ్రాంచైజీకి కాంచన 4 తో ముగింపు పలకాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సినీ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది. అయితే విశేషం ఏంటంటే కాంచన సిరీస్ కు ముగింపు పలికిన తర్వాత లారెన్స్ పూర్తిగా కొత్త తరహా కథలు, కొత్త ఫ్రాంచైజీలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కాంచన 4 నిజంగానే ఈ సిరీస్‌కు ముగింపు అవుతుందా? లేక మరోసారి సర్‌ప్రైజ్ ఇస్తారా? అన్నదానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. హార్రర్ జానర్ అంటే పిచ్చి ఉన్న అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
మరోవైపు కాంచన 4 సినిమాలో చాలామంది నటీనటులు సందడి చేయనున్నారు. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ మరో కీలక పాత్రలో మెరిసే అవకాశం ఉంది. ఇక కాంచన సిరీస్ రెగ్యులర్ నటులైన కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్ లతో పాటు కామెడీ స్టార్ రెడిన్ కింగ్స్ లీ, మీరా రాజ్ నటిస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఒక ముఖ్యమైన సోషల్ మెసేజ్‌ను హారర్ ఎలిమెంట్స్ కు జోడించి, ప్రేక్షకులను ఆలోచింపజేసేలా స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే వెల్లడికానుంది.












Click it and Unblock the Notifications