జర్నలిస్ట్ రఘు అరెస్ట్ ఇలా.. ఇదిగో సీసీటీవీ ఫుటేజీ, పోలీసులు ఎలా వచ్చారంటే..? (వీడియో)
ఇటీవల జర్నలిస్టు రఘును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అతను తొలుత కిడ్నాప్‌నకు గురయ్యాడని వార్తలు వచ్చాయి. తర్వాత కాస్తా పోలీసులే అరెస్ట్ చేసినట్టు తెలిసింది. తొలి వెలుగు యూ ట్యూబ్ చానెల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రావడంతో అరెస్ట్ చేశారు. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. ఇదే అంశంపై అతని భార్య లక్మీ ప్రవీణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా.. జైలు నుంచే రఘు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇంతవరకు ఓకే.. కానీ రఘును ఎలా అరెస్ట్ చేశారు. ఆ ఫుటేజీ చుద్దాం.

మఫ్టీలో పోలీసులే
రఘును గుర్తుతెలియని వ్యక్తులు తీసుకెళ్లారని ప్రచారం జరిగింది. జీపులో తీసుకెళ్లారని వార్తలు వచ్చాయి. కానీ రఘును పోలీసులే తీసుకెళ్లారు. రోడ్డు మీద అతనిని కారులోకి బలవంతంగా ఎక్కించారు. వారు యూనిఫామ్‌లో ఉంటే ఇబ్బందులు లేవు.. మఫ్టీలో ఉండటంతో సందేహాం వచ్చింది. అప్పటికే రఘుకు అనుమానం వచ్చి.. కారులో ఎక్కేందుకు ససేమిరా అన్నాడు. అయినా బలవంతంగా ఎక్కించేసరికి అలా ఉండిపోయారు. తర్వాత రఘు కిడ్నాప్ గురించి వార్తలు గుప్పుమన్నాయి. దీంతో పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టాల్సి వచ్చింది.

సంచలన కథనాలు
ఇటీవల జర్నలిస్ట్ రఘు పలు సంచలన కథనాలను ప్రసారం చేశారు. తొలివెలుగు యూట్యూబ్ చానల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం అయ్యాయి. మరోవైపు తెలంగాణ వాదులను, టీఆర్ఎస్ను గట్టిగా వ్యతిరేకించే వాళ్లను రఘు నిత్యం ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన ఒక్కసారిగా కనిపించకుండా పోవడం చర్చకు దారితీసింది.
కారణాలు ఇవే..?
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ జరిగింది. ఈ కేసులో నిందితుడిగా జర్నలిస్ట్ రఘు ఉన్నారు. ఆయనను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత హుజుర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. తర్వాత అతనిని హుజూర్ నగర్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. జర్నలిస్టులలో డేరింగ్ అండ్ డాషింగ్ గా రఘుకి పేరుంది.












Click it and Unblock the Notifications