కేసీఆర్ ఆ వ్యాఖ్యలే విజయారెడ్డి హత్యకు కారణం ... వీహెచ్ ఫైర్
తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన ఇంకా రాష్ట్రంలో హాట్ టాపిక్ గానే ఉంది. రెవెన్యూ ఉద్యోగుల పట్ల ఈ ఘటన తర్వాత ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇక రాజకీయ రంగు పులుముకున్న ఈ ఘటనపై అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విజయారెడ్డి హత్యకు టీఆర్ఎస్ ప్రభుత్వ పొరబాట్లే కారణమని ఆరోపించారు.
విజయారెడ్డిని హత్య చేసిన సురేశ్ టీఆర్ఎస్ కార్యకర్త అని పేర్కొన్న ఆయన సీఎం కేసీఆర్ తీరే హత్యకు కారణం అని ఆరోపించారు. తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖ విషయంలో ప్రవర్తించిన తీరు వల్లే ఇప్పుడు ఈ ఘటన జరిగిందని అన్నారు. అధికారులను కంట్రోల్ చెయ్యలేని ప్రభుత్వ విధానాలు వెరసి విజయారెడ్డి దారుణ హత్యకు కారణం అయ్యాయని వీహెచ్ ఆరోపణలు గుప్పించారు.

హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి చిత్రపటానికి ఈరోజు నివాళి అర్పించిన కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు లంచం అడిగితే కొట్టాలంటూ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలే విజయారెడ్డి హత్యకు కారణమని ఆరోపించారు. ఇక తాజా పరిణామాల నేపధ్యంలో రెవెన్యూ శాఖలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వీహెచ్ పేర్కొన్నారు . రెవెన్యూ కార్యాలయాలకు ఒక కానిస్టేబుల్ తో భద్రత కల్పించాలని చెప్పారు. లేదంటే ప్రజలు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో లోటుపాట్లు, భూముల ధరలు విపరీతంగా పెరగడం వల్లే ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయని వీహెచ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications