హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Crime News: కారులో సజీవదహనమయ్యాడు.. గోవాలో తేలాడు.. అస్సలు ఏం జరిగిందంటే..?

|
Google Oneindia TeluguNews

బీమా కట్టుకోండి.. ధీమాగా ఉండండి అని చెబుతారు. కానీ బీమానే అతని ప్రాణం తీసింది. చాలా బీమా డబ్బుల కోసం కట్టుకున్నవాళ్లు, తోబుట్టువులను అంతమందిస్తున్నారు.మెదక్‌ జిల్లాలోని టేక్మాల్ మండలం వెంకటాపురంలో ఇటీవల కారు తగలబడి ఓ వ్యక్తి సజీవ దహనమైయ్యాడు. మొదటగా దీన్ని ప్రమాదంగా భావించారు. కానీ పోలీసులు కేసు విచారించడంతో సంచలన విషయాలు బయటకొచ్చాయి.

కారు దగ్ధం

కారు దగ్ధం

జనవరి 9న టేక్మాల్‌ మండలం వెంకటాపురం వద్ద కారు దగ్ధమైంది. ఈ ఘటనలో భీమ్లా తండాకు చెందిన ధర్మ మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాద్‌ సెక్రటేరియేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ధర్మ కారులో సజీవదహనం కావటం స్థానికంగా సంచలనం సృష్టించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ప్రమాదస్థిలిలో పెట్రోల్‌ డబ్బా కనబడడంతో పోలీసులు అనుమానాలు వచ్చాయి.

ఫోన్ సిగ్నళ్లు

ఫోన్ సిగ్నళ్లు

దీంతో దర్యాప్తును ముమ్మరం చేసి సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా పలు కీలక విషయాలు తెలుసుకున్నారు. వారికి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేస్తుండగా ధర్మ సెల్‌ఫోన్‌ ఆన్‌లోనే ఉందని, అదీ గోవాలో ఉందని గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని చూసేసారి అక్కడ ధర్మ ఉన్నాడు. పోలీసులు అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చారు. ధర్మను విచారించగా.. ప్రమాదంలో చనిపోయింది మరో వ్యక్తి అని తేలింది.

ఈ నెల5న

ఈ నెల5న

అయితే ఆ నిందితుడు ఎవరో ఇప్పటికీ తెలియరాలేదు. అయితే ధర్మ ఎవరైనా అనాథను కారు వేసి కాల్చడా.. లేక ఇంకెవరైనా ఈ కేసులో ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ధర్మ ఈ నెల5న స్నేహితులతో కలిసి బాసర వెళ్లినట్లు సమాచారం. అయితే ధర్మ దారుణానికి బలైంది తన స్నేహితుడా లేదంటే డ్రైవరా అనే విషయం స్పష్టత రాలేదు.

English summary
Key facts have emerged in the case of a man who was burnt alive in a car. Man found burnt alive in Goa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X