మరో అంతర్జాతీయ సదస్సు నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం: కీలక అంశంపై ప్రసంగించాలని పిలుపు
హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందింది. ప్రపంచ హరిత విప్లవ పితాహహుడు నార్మన్ బోర్లాగ్ పేరు మీదుగా నిర్వహిస్తున్న బోర్లాగ్ ఇంటర్నేషనల్ సమావేశంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాల్సిగా సంస్థ ప్రతినిధులు కేటీఆర్‌కు ఆహ్వానం పలికారు.
రాష్ట్ర అనుభవాలను చర్చిండం వల్ల ప్రపంచ వ్యాప్తంగా బోర్లాగ్ ఇంటర్నేషనల్ సమావేశాలకు హాజరవుతున్న అనేక మందికి ఎంతో ప్రయోజనం ఉంటుందని ఆ ఆహ్వాన పత్రంలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అధ్యక్షుడు టెర్రి బ్రాన్‌స్టాడ్ తెలిపారు. తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను సమావేశంలో ప్రసంగించాలని కోరారు.

భవిష్యత్ తరాల కోసం వ్యవసాయ రంగంలో వనరుల సద్వినియోగంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలిపారు. కాగా, బోర్లాగ్ అంతర్జాతీయ సమావేశానికి ఆహ్వానించినందుకుగాను మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పాలన సంస్కరణల వల్ల గత పదేళ్లలో రాష్ట్రం వ్యవసాయ రంగా అభివృద్ధి కోసం ఎన్నో వినూత్నమైన, విప్లవాత్మకమైన కార్యక్రమాలను కొనసాగించిందని, వాటి ఫలాలను తెలంగాణ రైతాంగం అందుకుంటోందని కేటీఆర్ వివరించారు.
ఆహార భద్రత అంశంలో దేశానికి తెలంగాణ భరోసాగా నిలుస్తూ.. అన్నపూర్ణగా మారిందని తెలిపారు. ఇంతటి విజయవంతమైన తెలంగాణ వ్యవసాయ మోడల్‌ను.. బోర్లాగ్ అంతర్జాతీయ వేదికపై వివరించడానికి అందిన ఆహ్వానం.. తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దక్కిన గౌరవం' అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ సమావేశానికి వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డికి కూడా సంస్థ ఆహ్వానం పలికింది.
అక్టోబర్ 24 నుంచి 26 వరకు అమెరికాలోని అయెవా రాష్ట్రంలోని డెమోయిన్ సిటీలో ఈ సమావేశం జరగనుంది. ఈ ఏడాది జరగనున్న సమావేశంలో 'ట్రాన్స్‌ఫర్మేటివ్ సొల్యూషన్స్ టు అచీవ్ ఎ సస్టెయినబుల్, ఈక్విటబుల్ అండ్ నర్సింగ్ ఫుడ్ సిస్టమ్' అనే ఇతివృత్తం ఆధారంగా చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశానికి ప్రపంచ దేశాలకు చెందిన 1200 మంది అతిథులు నేరుగా హాజరుకానున్నారు.
మరోవైపు, వేల మంది ఆన్‌లైన్‌లో భాగస్వామ్యం అవుతారు. రాబోయే కాలంలో ప్రపంచ వ్యవసాయ రంగానికి ఆహారభద్రతకు ఎదురయ్యే సవాళ్లపై ప్రతి సంవత్సరం ఈ సమావేశాల్లో చర్చిస్తారు. ఈ అంతర్జాతీయ వేదికపై తెలంగాణ సాధించిన వ్యవసాయ ప్రగతి, రాష్ట్రం అనుసరించిన విధానాలపై చర్చించడం ద్వారా ప్రపంచ ఆహార కొరతను అధిగమించడం, ఆహార భద్రత, సరఫరాను పెంచడం, వంటి కీలకమైన అంశాలపై ఒక విస్తృత అవగాహన ఏర్పడుతుందని టర్రీ బ్రాన్ స్ట్రాడ్ తెలిపారు.












Click it and Unblock the Notifications