Hyderabad: అంబర్‍పేట ఘటనపై విచారం వ్యక్తి చేసిన కేటీఆర్..
హైదరాబాద్ అంబర్‍పేట కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై కేటీఆర్ స్పందించారు.
హైదరాబాద్ అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కుక్కల దాడిలో బాలుడు చనిపోవటం బాధకమని ఆయన అన్నారు. వీధి కుక్కల నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా స్టెరిలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామన్నారు. చనిపోయిన చిన్నారిని ఎలాగూ తీసుకురాలేమని.. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వమని స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లా
కాగా ఆదివారం అంబర్పేటలో ప్రదీప్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన గంగాధర్ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు. నాలుగేళ్లుగా అంబర్ పేట ఛే నెంబర్ చౌరస్తాలో ఉన్న ఓ కారు సర్వీస్ సెంటర్ లో వాచ్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు భార్య జనప్రియ, ఆరేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. వారు బాగ్ అంబర్ పేటలోని ఎరుకల బస్తీ ఉంటున్నారు.

అక్క కోసం
ఆదివారం పిల్లలకు సెలవు కావడంతో కుమార్తె, కొడుకు ప్రదీప్ ను తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్ కు తీసుకొచ్చాడు. బిడ్డను పార్కింగ్ వద్ద ఉన్న క్యాబిన్ లో ఉంచి.. కుమారుడిని లోపలికి తీసుకెళ్లాడు గంగాధర్.
ఏదో పనిపై గంగాధర్ మరో వాచ్ మెన్ తో కలిసి బయటకు వెళ్లాడు. ప్రదీప్ కు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్లాడు. ప్రదీప్ అక్కడే ఉండక.. పార్కింగ్ వద్ద ఉన్న అక్క వద్దకు బయల్దేరాడు.

ఆస్పత్రికి తరలించినా..
ఈ క్రమంలో బాలుడు నడిచి వస్తుండగా.. కుక్కలు మీదికి వచ్చాయి. ప్రదీప్ తప్పించుకునే ప్రయత్నం చేయగా.. కుక్కలు వదిలిపెట్టలేదు. ప్రదీప్ పై దాడి చేశాయి. అయితే ప్రదీప్ అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చి కుక్కలను వెళ్లగొట్టారు. వెంటనే అక్కడికి చేరుకున్న గంగాధర్ కుమారుడిని ఆస్పత్రికి తరలించాడు. కానీ ప్రదీప్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కుక్కలు తీవ్రంగా గాయపరచడంతో ప్రదీప్ ప్రాణాలు విడిచాడు.

సీసీ కెమెరాలో దాడి దృశ్యాలు
బాలుడిపై కుక్కలు దాడి చేసే ఘటన దృశ్యాలు అక్కడే సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కొడకు మృతితో గంగాధర్ కన్నీరుమున్నరయ్యారు. అనవసరంగా పిల్లలను ఇక్కడి తీసుకొచ్చానని బోరున విలపించారు.
నగరంలో వీధి కుక్కలు భారీగా పెరిగాయి. ఏ వీధికి వెళ్లినా కుక్కలు మందలు కనిపిస్తున్నాయని నగరవాసులు చెబుతున్నారు. హైదరాబాద్ లో కుక్కకాటు బాధితుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి కుక్కలను అదుపు చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

రాజ సింగ్
ఈ ఘటనపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేశారు. వీధి కుక్కలపై అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని మంత్రి కేటీఆర్ కు రాజాసింగ్ సూచించారు. తన ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉన్న విషయాన్ని మంత్రి గుర్తుంచుకోవాలన్నారు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని కోరారు.

వీహెచ్
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కూడా ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. వీధి కుక్కల దాడిలో చిన్నారి చనిపోవటం తననెంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
విశ్వాసం అంటే ఇది.. రూ.5 బిస్కెట్ ప్యాకెట్ వేస్తే 130కి.మీ వెంట నడిచిన శునకం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు












Click it and Unblock the Notifications