సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కరోనా పాజిటివ్.. స్వల్ప లక్షణాలేనని ట్వీట్
కరోనా.. ఒమిక్రాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా సోకింది. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కరోనా సోకిందని పోస్ట్ పెట్టారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా కోవిడ్ టెస్ట్‌లు చేయించుకోవాలని కోరారు.
స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని తెలిపారు. ప్రస్తుతం వైద్య మార్గదర్శకాలు పాటిస్తూ ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉన్నానని వివరించారు. ఎవరైనా ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్నట్టయితే వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే కరోనా సోకినా గానీ తీవ్ర లక్షణాలు ఉండవని, ఆసుపత్రి పాలయ్యే అవసరాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు. త్వరలోనే ఆరోగ్యం సంతరించుకుని మళ్లీ మీ ముందుకు వస్తాను అని ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల మహేశ్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు వెళ్లివచ్చారు.

నాలుగు వారాల నుంచి ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నెలాఖరులోగా ఒమిక్రాన్ వ్యాపి మరింత పెరిగే అవకాశం లేకపోలేదని డీహెచ్ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఫిబ్రవరిలోగా భారీగా కొవిడ్ కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఫిబ్రవరి చివరికి లోయస్ట్‌కి పడిపోయే ఛాన్స్ ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే చాలా నష్టపోతామని హెచ్చరించారు. అనవసరంగా జన సమూహాల్లోకి వెళ్లకూడదని, మాస్క్ మరువకూడదు.. వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని సూచనలు చేశారు. కోవిడ్ ఐసోలేషన్ కిట్స్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2022
గాదరింగ్స్ లేకుండా చూసుకోవాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా రద్దు చేసుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని.. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని అన్నిరకాలు ప్రోగ్రామ్స్ రద్దు చేసుకోవాలని డీహెచ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలన్నారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు 101 శాతం పూర్తి అయ్యిందన్నారు. సెకండ్ డోస్ 71 శాతం మాత్రమే పూర్తి అయ్యిందని చెప్పారు.












Click it and Unblock the Notifications