Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉలిక్కి పడ్డ పాతబస్తీ: పట్టపగలే వ్యక్తి హత్య.. ఆపై మర్మాంగాలు కోసేసిన స్నేహితులు

హైదరాబాదు : హైదరాబాదులోని పాతబస్తీ మరోసారి ఉలిక్కి పడింది. తన సన్నిహితులే ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. వివరాల్లోకి వెళితే...పాతబస్తీలో రవి అనే వ్యక్తిని అతనికి తెలిసినవారే దారుణంగా హత్య చేశారు. రవిని బాడీబిల్డర్ రవి అని కూడా పిలుస్తారు. పాతబస్తీలో పట్టపగలే ఈ హత్య జరిగింది. ఈ హత్యను చూసిన వారంతా ఒక్కసారి షాక్‌కు గురయ్యారు.

పాతబస్తీలో నివసించే రవి టీడీపీ కార్యకర్తగా తెలుస్తోంది. పాతబస్తీలో ఉంటే ఓ శివాలయంలో రవి తలదాచుకుంటున్నాడు. మద్యానికి ఇతరత్ర చెడు వ్యసనాలకు బానిస అవడంతో అతని కుటుంబ సభ్యులు కూడా రవిని దూరంగా ఉంచారు. దీంతో ఆయన ఓ పాతబడ్డ శివాలయం గదిలో నివాసముంటున్నాడు. అంతేకాదు ప్రతి గొడవలో తలదూర్చేవాడని స్థానికులు చెప్పారు. ఇక సంక్రాంతి రోజున తన ఇద్దరి స్నేహితులు రవి దగ్గరకు వచ్చారు.

Man in old city hacked to death by friends,Private parts chopped

మద్యం కూడా తమ వెంట తీసుకొచ్చారు. ఇక మద్యం తాగిన తర్వాత రవికి ఇద్దరి స్నేహితుల మధ్య ఏదో విషయమై విబేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో గొడవ పడ్డ వీరు... పథకం ప్రకారం ఈ ఇద్దరు స్నేహితులు కత్తులతో రవిపై దాడి చేశారు. వెంటనే రవి గుడిలోనుంచి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశాడు. అయితే ఇతన్ని వెంబడించిన ఇద్దరు స్నేహితులు ఒక దగ్గర రవిని అటాక్ చేసి కత్తులతో నరికి చంపారు. అంతేకాదు రవి మర్మాంగాలను కూడా కోసేశారు. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసి ఉంటుందన్న అనుమానం పోలీసులు వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+