మెడికో ప్రీతి మృతి: నేడు విద్యాసంస్థల బంద్ కు పిలుపు; మంత్రుల స్పందన ఇలా!!

మెడికో ప్రీతి మృతితో నేడు విద్యాసంస్థల బంద్ కు విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయి. మరోవైపు ప్రీతీ మృతిపై పలువురు మంత్రులు, నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల అనస్తీషియా పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కన్ను మూసింది. సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన ప్రీతి ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు ప్రీతి మృతి చెందినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ప్రీతిని కాపాడడం కోసం ప్రత్యేక వైద్య బృందం అన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇక ప్రీతీ మృతితో రాత్రంతా నిమ్స్ హాస్పటల్ వద్ద హై డ్రామా చోటు చేసుకుంది.

రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు

రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాల పిలుపు


ఇక ఈ ఘటన నేపథ్యంలో ర్యాగింగ్ భూతానికి ప్రీతి బలైందని ప్రీతి మరణ వార్త తర్వాత నుంచి నిమ్స్ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇక ఈ క్రమంలోనే నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గిరిజన విద్యార్థి సంఘాలు ,ఓయూ జెఎసి కూడా నేడు ప్రీతి మృతితో బంద్ పాటించాలని సూచించారు. ప్రీతి మృతికి కారణమైన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేఎంసి ప్రిన్సిపల్ పైన, హెచ్ ఓ డి పైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ప్రీతి మృతి పై మంత్రి హరీష్ రావు

ప్రీతి మృతి పై మంత్రి హరీష్ రావు

ఇదిలా ఉంటే ప్రీతి మృతి వార్తపై తెలంగాణ మంత్రులు నేతలు స్పందిస్తున్నారు. డాక్టర్ ప్రీతి ఎప్పటిలాగే ఆరోగ్యంగా తిరిగి వస్తుందనుకున్నామని ఇలా జరగడం మనసును కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. మృత్యువుతో పోరాడి ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని, నిమ్స్ వైద్యుల బృందం ఆమెను కాపాడడం కోసం నిర్విరామంగా శక్తివంచన లేకుండా శ్రమించిందని పేర్కొన్నారు. పూర్తి ఆరోగ్యవంతురాలుగా వస్తుందనుకున్న డాక్టర్ ప్రీతి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తన మనసును తీవ్రంగా కలిసిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

ప్రీతి మృతిపై మంత్రి సత్యవతి రాథోడ్

మంత్రి సత్యవతి రాథోడ్ మృత్యువుతో పోరాడుతూ వైద్య విద్యార్థిని ప్రీతి తుది శ్వాస విడవడం దురదృష్టకరమని, పూర్తి ఆరోగ్యవంతురాలుగా వస్తుంది అనుకున్న ప్రీతి మరణించడం తీవ్రంగా కలచి వేసిందని, తన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.

ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలు

ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీలు


ఇక మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఈ ఘటన పైన తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ర్యాగింగ్ కొనసాగుతుందని, విద్యార్థి ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితి చోటు చేసుకుందని, ప్రీతి మరణానికి ప్రభుత్వానితే బాధ్యత అంటూ తీవ్ర స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ర్యాగింగ్ భూతానికి మరొక విద్యార్థిని బలైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు. ఎవరికి వారు తమదైన శైలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక బిజెపి లవ్ జిహాద్ కు మరో విద్యార్థిని బలైందని తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంటే, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే, ప్రభుత్వ అసమర్థత వల్లే రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కాంగ్రెస్ మండిపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+