జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మెట్రో రైలు.. త్వరలోనే ప్రారంభం..!
హైదరాబాద్ : భాగ్యనగరంలో మెట్రో రైలుకు ఆదరణ పెరుగుతోంది. ప్రయాణీకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. దాంతో మెట్రో అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో మెట్రో సర్వీస్ ప్రారంభమైన తొలినాళ్లలో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. అయితే క్రమక్రమంగా ఆయా రూట్లలో మెట్రో సర్వీసులు ప్రారంభం కావడం.. వాటిలో ప్రయాణించడంతో సమయం కలిసిరావడం.. ఇదంతా కూడా ప్లస్ అయింది. అదే క్రమంలో జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి ఇమ్లిబన్ బస్ స్టేషన్ వరకు మరో సర్వీస్ ప్రారంభం కానుంది.
జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఇమ్లిబన్ బస్ స్టేషన్ వరకు మరో మెట్రో రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రూట్‌లో డిసెంబర్ నుంచి మెట్రో సర్వీస్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. కారిడార్ - 2 పరిధిలోకి వచ్చే ఈ రూట్ మొత్తం 15 కిలోమీటర్ల పరిధిలో ఉంది. అయితే డిసెంబర్ నుంచి 9.6 కిలోమీటర్ల మేర మెట్రో సర్వీస్ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆ మేరకు అనుమతులు కూడా లభించాయి.

భార్యపై కోపం.. నాలుక ఖతం.. ఓ భర్త చేసిన పనికి..!
హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మిగతా కారిడార్లలో కూడా త్వరలోనే రైళ్లు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. నగరంలో మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 9 కోట్ల మంది ప్రయాణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మొత్తానికి నగరమంతటా మెట్రో పరుగులు పెడితే హైదరాబాద్ వాసులకు సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణం కూడా ఈజీ కానుంది.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications