తొలి విజయం ఎంఐఎం ఖాతాలో ... ఆపై మెట్టుగూడా, యూసుఫ్ గూడాలోనూ టీఆర్ఎస్ విజయం
జిహెచ్ఎంసి ఎన్నికలలో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. తొలి ఫలితం మజ్లిస్ పార్టీ ఖాతాలో పడింది . మెహిదీపట్నం డివిజన్ నుంచిమజ్లిస్ పార్టీ అభ్యర్థి మాజీద్ హుస్సేన్ విజయం సాధించారు . హైదరాబాద్ మేయర్ పీఠాన్ని గతంలో ఎంఐఎం అధిష్టించినప్పుడు మేయర్ గా పనిచేశారు మాజీద్ హుస్సేన్ . మొత్తానికి గ్రేటర్లో తొలి విజయం ఎంఐఎం ఖాతాల్లో నమోదయింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంఐ ఎం ఈ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తామన్న ధీమాలో ఉంది.
ఇటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ సైతం బోణీ కొట్టింది . రెండు స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మెట్టుగూడా లో టిఆర్ఎస్ అభ్యర్థి రాసురి సునీత, యూసుఫ్ గూడా లో అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ విజయం సాధించారు . దీంతో టీఆర్ఎస్ ఖాతాలో రెండు స్థానాలు పడినట్లుగా అయింది. మెహదీపట్నం లో మజ్లిస్ అభ్యర్థి మాజీద్ హుస్సేన్ విజయం సాధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొదటి అభ్యర్థిగా ఖాతా తెరవగా, ఇక ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తూ దూకుడు కొనసాగిస్తోంది.

ప్రస్తుతం 21 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బిజెపి 15 స్థానాల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యతను కనబరుస్తున్నట్టుగా తాజా సమాచారం. ఇక మరోవైపు అమీర్ పేట , ఖైరతాబాద్, సనత్ నగర్ వంటి పలు డివిజన్లలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు దగ్గరలో ఉన్నారు. మరికొన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ. బిజెపి అభ్యర్థులు హోరాహోరీగా పోరాడుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికలలో ఓట్ల లెక్కింపు గట్టి భద్రత మధ్య కొనసాగుతుంది . ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది .
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications