నిధులు ఇచ్చి, అప్పుకు అనుమతిచ్చి.. ఇప్పుడిలా, షెకావత్ కామెంట్లపై హరీశ్ రావు గుస్సా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. ఇష్యూ ఏదయినా సరే మాటల యుద్దం జరుగుతుంది. కాళేశ్వరం ప్రజెక్టులో అవినీతి జరిగిందని కేంద్రమంత్రి షెకావత్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఇదీ సరికాదు అని ఆయన విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులు కట్టేందుకు అనుమతులు ఇచ్చింది మీరే కదా? అని నిలదీశారు. అవసరమైన నిధులు, అప్పు తెచ్చుకునేందుకు అనుమతించింది మీరే కదా? అని ప్రశ్నించారు.
ఇచ్చిన అప్పులు బాగా సద్వినియోగం చేశారని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ శర్మ చెప్పారని హరీశ్ రావు వెల్లడించారు. కాళేశ్వరం ఇంజినీరింగ్ ఒక అద్భుతం అన్నారని, ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు అని కొనియాడారని గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్రమంత్రి షెకావత్ బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని చూసి బీజేపీ నేతల కడుపు మండిపోతోందని హరీశ్ రావు విరుచుకుపడ్డారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసించిన వీడియోను ప్రదర్శించారు. మోడీ ఇలా మాట్లాడితే.. కేంద్రమంత్రులు ఇలా బీహెవ్ చేస్తారా అని విరుచుకుపడ్డారు. అయితే అంతకుముందు కేంద్రమంత్రి షెకావత్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వేల కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు.
ప్రాజెక్టుకు తగిన అనుమతి పొందకుండా నిర్మించారని వెల్లడించారు. వర్షాలకు మూడు పంప్ హౌస్ నీటమునిగాయని, పంప్ అమరికలో సాంకేతిక వైఫల్యాలు ఉన్నాయని విమర్శించారు. పంప్‌ల మరమ్మతుల పేరుతో అవినీతి జరిగేందుకు అవకాశం ఉందని షెకావత్ ఆరోపణలు చేశారు. ఈ కామెంట్లను మంత్రి హరీశ్ రావు ఖండించారు.












Click it and Unblock the Notifications