ts assembly:ఈటల పక్కన జగదీశ్ రెడ్డి, భౌతికదూరం ఏదీ అని స్పీకర్ చురకలు
కరోనా వైరస్ విజృంభించడంతో అసెంబ్లీ సమావేశాలకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విధిగా కరోనా వైరస్ పరీక్ష చేయించుకోవాలని.. రిపోర్టుతో రావాలని స్పష్టంచేశారు. జ్వరం, దగ్గు, జలుబు ఉంటే రావొద్దని కూడా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. అసెంబ్లీ నుంచి ఇంటికి, ఇంటి నుంచి అసెంబ్లీకే రావాలని కూడా సూచించారు. ఈసారి విజిటర్స్ గ్యాలరీ కూడా లేదు. సభలో గల సీట్లలో మార్కింగ్ చేశారు. కొన్ని సీట్లను బ్లాక్ చేసి.. పక్క సీట్లలో కూర్చొవద్దని స్పష్టంచేశారు.
సభలో కొన్ని సీట్లను నో సీటింగ్ జోన్లుగా ప్రకటించారు. అక్కడ ఎవరూ కూర్చొవద్దు అని అర్థం. అయితే గురువారం సభ జరుగుతుండగా.. ఈటల రాజేందర్ వద్దకు మంత్రి జగదీశ్ రెడ్డి వచ్చారు. వెంటనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గమనించారు. భౌతికదూరం తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టంచేశారు.

Recommended Video
వారిద్దరినీ చూసి.. జగదీశ్ రెడ్డిని ఎందుకు అక్కడ కూర్చొన్నారని ప్రశ్నించారు. నో సీటింగ్‌లో కూర్చొవద్దు అని చెప్పారు. దీంతో అక్కడినుంచి జగదీశ్ రెడ్డి తన సీటులోకి వెళ్లిపోయారు. కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో.. భౌతికదూరం కంపల్సరీ పాటించాలని సభ్యులకు స్పీకర్ స్పష్టంచేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications