హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌పై అమెజాన్ ప్రేమ! తొలి ప్రైమ్ ఎయిర్ కార్గో శంషాబాద్‌లో ప్రారంభం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలంగాణ పారిశ్రామిక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో అమెజాన్ ఎయిర్‌కార్గో విమానమైన ప్రైమ్ ఎయిర్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

హైదరాబాద్‌పై అమెజాన్ ప్రేమ కొనసాగుతోందన్న కేటీఆర్

ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు మంత్రి కేటీఆర్. గత ఏడేళ్లుగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ నగరంపై అమెజాన్ ప్రేమ కొనసాగుతోందన్నారు. అమెజాన్ బృందాన్ని ఈ సందర్భంగా అభినందించారు.

హైదరాబాద్‌లోనే తొలి అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో ప్రారంభం


యూఎస్, యూరోప్ తర్వాత తొలిసారిగా హైదరాబాద్ నగరంలోనే తొలిసారి అమెజాన్ ఎయిర్‌ను ప్రారంభించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
అమెజాన్ అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లోనే ఉందని కేటీఆర్ అన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రూ. 36,300 కోట్ల పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. అంతేగాక, ఏవియేషన్ రంగంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్ పోర్టు అని చెప్పారు. హైదరాబాద్ గ్రీన్ సిటీ అవార్డును సొంతం చేసుకుందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.

ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన: మంచుకొండల్లో ఇలా..

ముగిసిన కేటీఆర్ దావోస్ పర్యటన: మంచుకొండల్లో ఇలా..


కాగా, జనవరి 15న తెలంగాణ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ కు వెళ్లిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి సదస్సు ముగియడంతో ఆయన ఆదివారం తిరుగుపయనమయ్యారు. ఎనిమిది రోజుల విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని కేటీఆర్ సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అంతకుముందు దావోస్ మంచు పర్వతాల్లో కేటీఆర్ దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. మంచుకు ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది అని పేర్కొన్నారు. కాగా, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో అనేక దిగ్గజ కంపెనీలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. సుమారు 30వేల కోట్లకుపైగా పెట్టుబడుడులు తెలంగాణకు వచ్చాయి. త్వరలోనే పలు కంపెనీలో తమ కార్యకలాపాలను హైదరాబాద్ నగరంలో ప్రారంభించనున్నాయి.

English summary
minister ktr inaugurates amazon Prime air cargo flight in shamshabad airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X