హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మైనర్ రాష్ డ్రైవింగ్.. బాలుడితో పాటు తండ్రి కూడా అరెస్ట్..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బోయిన్‌పల్లిలో నలుగురు మైనర్లు సరదాగా కారు నడుపుతూ ఓ ఆటోను ఢీకొట్టి ఇద్దరి మరణానికి కారణమయ్యారు. కూకట్‌పల్లిలో నివాసముంటున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నాగమణి ఆదివారం నాడు తన కోడలు, ఇద్దరు మనవళ్లతో కలిసి యాప్రాల్ లోని తన మేనల్లుడి ఇంటికి వెళ్లేందుకు ఓలా ఆటో బుక్ చేసుకున్నారు. అయితే డెయిరీ ఫామ్ క్రాస్ రోడ్డులోని కంటోన్మెంట్ చెక్‌పోస్టు దగ్గర ఎదురుగా అతివేగంతో వచ్చిన కారు వీరి ఆటోను ఢీకొట్టడంతో నాగమణితో పాటు 14 నెలల తన మనవడు ప్రాణాలు కోల్పోయారు.

కారులో స్పీడ్‌గా వెళుతూ ఈ ప్రమాదానికి కారణమైన నలుగురు మైనర్లలో ముగ్గుర్ని అప్పటికప్పుడే పోలీసులు పట్టుకున్నారు. అయితే కారును నడిపిన బాలుడు మాత్రం తప్పించుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఆ బాలుడితో పాటు తండ్రిని కూడా అరెస్ట్ చేశారు. కారు నడిపిన హసన్‌తో పాటు అతడి తండ్రి నూరుద్దీన్‌ను రిమాండుకు తరలించారు.

minor car rash driving father arrest in hyderabad

ఏపీ, తెలంగాణ టీచర్ల నియామకంలో ఆలస్యంపై విచారణ.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే..!

కారు స్పీడ్‌గా నడపడమే గాకుండా వారు మద్యం సేవించినట్లు తెలుస్తోంది. మైనర్లకు కారు ఇవ్వడం తప్పనే కోణంలో సదరు బాలుడి తండ్రిని కూడా అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. ఇటీవల హైదరాబాద్‌లో మైనర్లు ఇలాగే వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనలు వెలుగుచూస్తుండటంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అదే క్రమంలో బోయిన్‌పల్లి రోడ్డు ప్రమాదంలో మైనర్ బాలుడి తండ్రిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

English summary
Four minors were killed in an auto collision in Hyderabad's Bowenpally, causing the death of two people. Three of the four minors responsible for the accident have already been arrested by police. The boy who was driving the car, however, escaped. The police have registered a case and started investigating. Hasan and his father Nooruddin were remanded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X