Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ, తెలంగాణ టీచర్ల నియామకంలో ఆలస్యంపై విచారణ.. సుప్రీంకోర్టు ఏమన్నదంటే..!

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టీచర్ల నియామకంలో జరిగిన ఆలస్యంపై దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఆ మేరకు సోమవారం నాడు మరోసారి విచారించిన జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం పలు అంశాలను ప్రస్తావించింది. అయితే ఇరు రాష్ట్రాల నుంచి హాజరైన చీఫ్ సెక్రటరీలు ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎస్‌కే జోషి న్యాయస్థానంలో అఫిడవిట్లు దాఖలు చేశారు. టీచర్ల ఖాళీల భర్తీ అంశంతో పాటు స్కూళ్లల్లో మౌలిక వసతుల కల్పనపై వివరించారు.

ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం వచ్చే నెల 4వ తేదీ లోపు టీచర్ల నియామకాన్ని పూర్తి చేస్తామని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అంతేగాకుండా స్కూళ్లల్లో మౌలిక వసతులకు సంబంధించి కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. అయితే ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అదలావుంటే ఆరు నెలల్లోగా టీచర్ల నియామకాలతో పాటు స్కూళ్లల్లో వసతుల ఏర్పాట్లపై న్యాయస్థానం ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

 supreme court hearing on ap and telangana teachers recruitment

మైనార్టీలకు ఇక పెద్ద దిక్కు బండి సంజయేనా.. ఎంఐఎం, టీఆర్ఎస్ దోస్తీకి చెక్..?

తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేశారు. తెలంగాణలో ఇదివరకే రెండు వేల టీచర్ల నియామకాలు పూర్తి చేసినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇవే గాకుండా ఇంకా నాలుగు వేల పోస్టులకు పైగా టీచర్లను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని.. అయితే హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో ఆలస్యమవుతున్నట్లుగా సుప్రీంకోర్టుకు విన్నవించారు. అదలావుంటే తెలంగాణ అంశాన్ని వచ్చే వారం విచారిస్తామని తెలిపింది ధర్మాసనం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+