• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మైనార్టీలకు ఇక పెద్ద దిక్కు బండి సంజయేనా.. ఎంఐఎం, టీఆర్ఎస్ దోస్తీకి చెక్..?

|

హైదరాబాద్ : ఢిల్లీ బీజేపీ పెద్దలు తెలంగాణపై కన్నేశారు. టీఆర్‌ఎస్ దూకుడుకు కళ్లెం వేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్నారు. మైనార్టీలను తమవైపు తిప్పుకుని తెలంగాణ గడ్డపై కాలుమోపడానికి సన్నద్ధమవుతున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీకి బ్రేకులు వేసి మైనార్టీ సంక్షేమానికి పాటుపడే ప్రయత్నం చేస్తున్నారు. తాజా పరిణామాలు గమనిస్తే గనక ఇవన్నీ కూడ స్పష్టంగా అర్థమవుతాయి.

ట్రిపుల్ తలాక్ బిల్లును చట్టంగా చేసి మైనార్టీ మహిళలను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన బీజేపీ.. అదే క్రమంలో తెలంగాణలో మైనార్టీలకు పెద్దపీట వేసి కారు జోరుకు బ్రేకులు వేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా క్లియర్ పిక్చర్ కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో తెలంగాణ మైనార్టీ సంక్షేమ సభ్యుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణపై కన్ను.. బలం పెంచుకునే దిశగా..!

తెలంగాణపై కన్ను.. బలం పెంచుకునే దిశగా..!

తెలంగాణ వైపు గట్టిగా కన్నేసిన ఢిల్లీ బీజేపీ పెద్దలు.. క్రమక్రమంగా కమలం బలం పెంచేందుకు సిద్ధమయ్యారు. గులాబీ పరిమళాన్ని తగ్గించి కమలం వికసించే దిశగా అడుగులేస్తున్నారు. ఆ క్రమంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దగ్గర్నుంచి ఆపరేషన్ కమలం స్పీడప్ చేశారు. కలిసొచ్చే నేతలకు కాషాయం కండువా కప్పేస్తూ బీజేపీని పటిష్టం చేసే పనిలో పడ్డారు. అంతేకాదు ఢిల్లీ పెద్దలు రాష్ట్రంలో పర్యటించి స్థానిక నేతల్లో హుషారు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

2023లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసి అధికారం చేజిక్కించుకుంటామని పలు సందర్భాల్లో బీజేపీ నేతలు నొక్కి వక్కాణిస్తున్నారు. ఆ ప్రయత్నంలో అడుగు ముందుకేస్తూ పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఉద్యమ నేపథ్యంతో బలపడి రాజకీయ శక్తిగా అవతరించిన టీఆర్ఎస్‌ పార్టీకి క్షేత్రస్థాయిలో జనబలముంది. దాన్ని ఎలాగైనా తమకు అనుకూలంగా మార్చుకుని కారు స్పీడుకు బ్రేకులు వేయాలన్నది బీజేపీ అంతరంగంగా కనిపిస్తోంది.

ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం.. విదేశాల్లో ఎక్కువ జీతాలతో అవకాశాలు..!

ఎంఐఎం, టీఆర్ఎస్ దోస్తీకి చెక్ పెట్టేలా..!

ఎంఐఎం, టీఆర్ఎస్ దోస్తీకి చెక్ పెట్టేలా..!

తెలంగాణలో ఎంఐఎం, టీఆర్ఎస్ దోస్తీ గురించి వేరే చెప్పనక్కర్లేదు. పరోక్ష పొత్తు మెయిన్‌టెయిన్ చేస్తూ ఇరు పార్టీలు సహకరించుకుంటున్నాయి. మైనార్టీ ఓటు బ్యాంక్‌పై కన్నేసిన టీఆర్ఎస్ ఆ విధంగా మజ్లిస్ పార్టీతో ముందుకెళుతోంది. అయితే తెలంగాణ గడ్డపై టీఆర్ఎస్ హవాకు చెక్ పెడుతూ దూసుకెళ్లాలని కలలుగంటున్న బీజేపీ.. మొదట టీఆర్ఎస్ పార్టీకి మైనార్టీ లింక్ తొలగించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది తాజా వ్యవహారం.

తెలంగాణ మైనారిటీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ మేరకు మైనార్టీ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పచ్చ జెండా ఊపారు. దాంతో స్టేట్ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు.

మైనార్టీలకు సంక్షేమ పథకాలు.. అమలు ఇలా..!

మైనార్టీలకు సంక్షేమ పథకాలు.. అమలు ఇలా..!

ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం పథకం కింద కేంద్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి 15 ప్రధాన కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. అయితే వాటిని ప్రతిపాదించడం, అమలు చేయడం మైనార్టీ సంక్షేమ కమిటీ బాధ్యత. 1.మైనార్టీ ప్రజల విద్య కోసం సర్వశిక్షా అభియాన్, 2.కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ పథకం, 3.ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసం కోసం ఉర్దూ భాష ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ, 4.మదర్సా విద్యావిధానం ఆధునికీకరణ, 5.మైనార్టీలకు అందుబాటులో ఉండే విధంగా ఐసిడిఎస్ సేవలు, 6.మైనార్టీ విద్యార్థులకు అందించే ఉపకార వేతనాలు, 7.మౌలానా ఆజాద్ విద్య ఫౌండేషన్, 8.మౌలిక వసతుల కల్పన, 9.స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్ యోజన పథకం కింద స్వయం ఉపాధి, 10.పేదలైన మైనార్టీలకు కనీస వేతన చట్టం అమలు, 11.వ్యక్తిగత సాంకేతిక నైపుణ్యంలో అభివృద్ధి, 12. మైనార్టీల అభివృద్ధి కోసం ఆర్థిక సంస్థ ద్వారా రుణాల పంపిణీ, 13. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో నియామక ప్రక్రియ 14. ఇందిరా ఆవాస్ యోజన ద్వారా పేదలైన గ్రామీణ మైనారిటీలకు ఇళ్ల నిర్మాణం, 15. బాధితులైన మైనారిటీల హక్కుల పరిరక్షణ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఈ కమిటీ పనిచేస్తుంది.

  విజయవంతంగా నాంపల్లి లో బీజేపి భారీ బహిరంగ సభ || Huge Joinings From Telangana Districts To BJP
   బండి సంజయ్‌కు మైనార్టీ సంక్షేమం బాధ్యతలు..!

  బండి సంజయ్‌కు మైనార్టీ సంక్షేమం బాధ్యతలు..!

  తెలంగాణ మైనారిటీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను నియమించడంపై ఢిల్లీ బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించారనే టాక్ నడుస్తోంది. మైనార్టీలకు దగ్గరయ్యేలా చొరవ తీసుకుని జనాల్లోకి వెళ్లగలిగే సత్తా ఉన్న నాయకుడిగా హైకమాండ్ ఆయన్ని గుర్తించినట్లు స్పష్టమవుతోంది. అదే క్రమంలో టీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీకి చెక్ పెట్టేలా వ్యూహం నడపడంతో బండి సంజయ్ సక్సెస్ అవుతారనే కారణంతోనే ఆయనకు ఆ పదవి కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

  మైనార్టీలు అత్యధికంగా ఉండే హైదరాబాద్ పాతబస్తీ, చార్మినార్ లాంటి ఏరియాల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వారికి దగ్గరయ్యేలా చేయడం, వారిని చైతన్యవంతులను చేయడమనేది అంతా ఆషామాషీ కాదు. ఆ నేపథ్యంలోనే బండి సంజయ్ లాంటి యువనేతకు ఆ పోస్ట్ ఇస్తే జనాల్లోకి హుషారుగా వెళ్లడమే గాకుండా వాటిని లబ్దిదారులకు చేరవేయడంలో కీ రోల్ పోషిస్తారనేది ఢిల్లీ పెద్దల వ్యూహాంగా కనిపిస్తోంది.

  మైనర్ల ర్యాష్ డ్రైవింగ్.. సరదా కోసం మందు తాగి.. అమ్మమ్మ, మనవడు బలి..!

  రాష్ట్రమంతటా తిరుగుతా.. మైనార్టీలకు న్యాయం చేస్తా : బండి

  రాష్ట్రమంతటా తిరుగుతా.. మైనార్టీలకు న్యాయం చేస్తా : బండి

  తెలంగాణ మైనారిటీ సంక్షేమ కమిటీ సభ్యుడిగా తన నియామకంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలను వారికి అందించాల్సిన బాధ్యత తనపై ఉందని వ్యాఖ్యానించారు. ఆ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ నిర్దేశించిన సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రమంతటా పర్యటించి పక్కదారి పడుతున్న మైనార్టీ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించే దిశగా తనవంతు ప్రయత్నం చేస్తానని ప్రకటించారు.

  English summary
  BJP Focus On Telangana State to break the TRS Speed. Meanwhile BJP Highcommand targets to attract minorities. In that way, Union Minister for Minority Affairs Mukhtar Abbas Naqvi has nominated Karimnagar MP Bandi Sanjay as a member of the State Level Committee of Telangana. The SLC is entrusted with the implementation of Prime Ministers New 15 Point Programme for the welfare minorities.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more