హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం.. విదేశాల్లో ఎక్కువ జీతాలతో అవకాశాలు..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ కోర్సుకు డిమాండ్ పెరుగుతోంది. ఆయా సంస్థలు, కంపెనీల్లో భద్రతా ప్రమాణాల బాధ్యత తీసుకోవాల్సిన ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీర్లకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ కోర్సు పూర్తిచేసిన ఇంజనీర్లకు దేశవిదేశాల్లో ఎక్కువ వేతనాలతో కూడిన అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. ఇందులో కొంచెం పట్టు సాధించి సబ్జెక్టు అవగాహన పెంచుకుంటే చాలు అధిక వేతనంతో కూడిన ఉద్యోగం గ్యారంటీగా ఉంటోంది.

ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ సంస్థ ఈ కోర్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆ మేరకు ఆ సంస్థ నిర్వాహకులు ఆదివారం నాడు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి పలు విభాగాల్లో కోర్సులు అందిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈ కోర్సుకు సంబంధించి తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

<strong>గాంధీ భవన్ నుంచే విజయశాంతిపై కుట్ర జరుగుతోందా..? సంచలన వ్యాఖ్యలు చేసిన రాములమ్మ!!</strong>గాంధీ భవన్ నుంచే విజయశాంతిపై కుట్ర జరుగుతోందా..? సంచలన వ్యాఖ్యలు చేసిన రాములమ్మ!!

fire and safety course applications invited by central institute

పోస్ట్ డిప్లమో ఇన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎన్విరాన్‌మెంట్, డిప్లమో ఇన్ ఫైర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆపరేషన్, డిప్లమో ఇన్ ఫైర్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఇన్ సబ్ ఆఫీసర్, సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఫైర్ ఆఫీసర్ తదితర విభాగాల్లో శిక్షణ అందించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్మీడియట్, డిప్లమో (పాలిటెక్నిక్), డిగ్రీ, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

నేషనల్ సెంటర్ ఫర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ సంస్థ నిర్వహించే ఈ కోర్సులు విజయవంతంగా పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్స్ ఇస్తామని తెలిపారు. ఈ కోర్సులు కంప్లీట్ చేసినవారికి ఉపాధి అవకాశాలకు కొదవ లేదని నిర్వాహకులు చెప్పారు. విదేశాలలో సైతం ఎక్కువ జీతాలతో ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు సెప్టెంబర్ 9వ తేదీగా నిర్ణయించారు. ఆసక్తిగలవారు మరిన్ని వివరాల కోసం ఈ ఫోన్ నెంబర్‌ను కాంటాక్ట్ చేయొచ్చన్నారు. www.ncttindia.com వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

English summary
Demand for fire and safety engineering courses is growing. Fire and safety engineers have good job opportunities in their respective companies. Engineers who complete this course are welcomed with higher salaries in out side countries. To this end, the Central Government-sponsored National Center for Fire and Safety Engineering is inviting applications for these courses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X