ఆరెంజ్ ఆర్మీకి ఊహించని షాక్ - ప్యాట్ కమిన్స్ సంచలన నిర్ణయం..!!
ఐపీఎల్ ముగిసింది. ఈ సారి సన్ రైజర్స్ అభిమానులను ఆకట్టుకుంది. కెప్టెన్ గా కమ్మిన్స్ టీం ను నడిపించాడు. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ చేతిలో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో తదుపరి సీజన్ కోసం తమ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం ప్రారంభించింది. అయితే ఈ లోపే ఎస్ఆర్ హెచ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఊహించని విధంగా టీంను తన దైన నిర్ణయా లతో ముందుకు నడిపిస్తున్న కమ్మిన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
సన్ రైజర్స్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఆ జట్టు కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఈ విషయమై కమిన్స్ స్వయం గా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కమ్మిన్స్ తాజాగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. 'వచ్చే ఏడాది తాను కచ్చితంగా ఒక టోర్నీకి దూరం కావాల్సి ఉంటుంది. అయితే అది నా దేశం తరఫున ఆడే టెస్ట్ మ్యాచ్‌లు లేదా వన్డే ప్రపంచకప్ మాత్రం కాదు. సమయం వచ్చినప్పుడు తాను తన ఐపీఎల్ ఫ్రాంచైజీతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతానికి అయితే తాను ఏ విషయాన్ని స్పష్టం చేయలేనంటూ చెప్పిన అంశాలతో ఇక కమ్మిన్స్ ఐపీఎల్ కు దూరం అవుతున్నట్లుగానే చర్చ సాగుతోంది. ఈ కమిన్స్ చేసిన ఈ వ్యాఖ్యలపై క్రికెట్ నిపుణులు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కమ్మిన్స్ సంకేతాల వెనుక
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు 2027 అత్యంత కీలకం కానుంది. ఆ ఏడాది ఆస్ట్రేలియా జట్టు ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, వన్డే ప్రపంచకప్ 2027 ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఉన్న ప్యాట్ కమిన్స్.. దేశం తరఫున ఈ పెద్ద టోర్నమెంట్లన్నింటికీ అందుబాటులో ఉండటం కోసం ఐపీఎల్ 2027కు దూరం కావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ముందుగా ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చే క్రమంలోనే ఈ సంకేతాలు అందించినట్లు చర్చ సాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు అన్ని రకాలుగా మంచి ఫాంలో ఉంది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. కమ్మిన్స్ 2026 సీజన్ లో అందుబాటులోకి వచ్చే వరకూ ఇషాన్ కిషన్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించాడు. ఇక, ఇప్పుడు కమ్మిన్స్ దూరం అయితే... జట్టు యాజమాన్యం ఎవరికి పగ్గాలు అప్పగిస్తుందనేది కీలకంగా మారనుంది.













Click it and Unblock the Notifications