బండి సంజయ్ కు ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న : మమతా బెనర్జీ గెలిచింది.. మోడీ రాజీనామా చేస్తారా?

తెలంగాణ రాష్ట్రంలో శాసన సభ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య అనేక అంశాలపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఇక తాజాగా కెసిఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు.

కెసిఆర్ గెలిచినన్ని ఎన్నికలు ఎవరూ గెలవలేదన్న కవిత

కెసిఆర్ గెలిచినన్ని ఎన్నికలు ఎవరూ గెలవలేదన్న కవిత

బండి సంజయ్ రాష్ట్రంలో ప్రతి ఎన్నికను సవాల్ చేయడం కరెక్ట్ కాదని కవిత అభిప్రాయపడ్డారు. నిన్న భవానిపూర్ లో మమతాబెనర్జీ గెలిచిందని .. ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్నించారు. మమతా బెనర్జీ ఎన్నికను భారతీయ జనతా పార్టీ ఛాలెంజ్ గా తీసుకుంది కదా అంటూ పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని హితవు పలికారు. రాజకీయాలను ప్రతిపక్షాలు ఎక్కడికి తీసుకెళ్తున్నాయో అర్థం కావడం లేదని కవిత విమర్శించారు. కెసిఆర్ గెలిచినన్ని ఎన్నికలు ఎవరూ గెలవలేదని కవిత అభిప్రాయపడ్డారు. మీడియాలో కనిపించడం కోసమే బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

హుజురాబాద్ ఉపఎన్నికపై బండి సంజయ్ వ్యాఖ్యలు

హుజురాబాద్ ఉపఎన్నికపై బండి సంజయ్ వ్యాఖ్యలు

నిన్నటికి నిన్న బండి సంజయ్ తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కు ఆర్ ఆర్ ఆర్ సినిమా చూపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ ఆర్ ఆర్ అంటే రాజాసింగ్, రఘునందన్, రాజేందర్ అంటూ ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో హుజురాబాద్ ఉప ఎన్నిక కరెన్సీ నోటుకు కమలం పువ్వు కు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ బండి సంజయ్ స్పష్టం చేశారు. హుజురాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని బండి సంజయ్ పేర్కొన్నారు. హుజురాబాద్ లో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా అంటూ సవాల్ చేశారు.

 బండి వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన కవిత

బండి వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన కవిత

ఈ క్రమంలోనే హుజురాబాద్ లో బీజేపీ గెలిస్తే కెసిఆర్ రాజీనామా చేస్తారా ? అన్న సవాల్ కు కవితా దీటుగా బదులిచ్చారు. భవాని పూర్ లో మమతా బెనర్జీ గెలిచింది మోడీ రాజీనామా చేస్తారా ? అంటూ బండి సంజయ్ ను ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలని బిజెపి, బిజెపికి గట్టి షాక్ ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ హోరా హోరీ గా ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి.

 దూకుడు పెంచిన కవిత .. మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లో

దూకుడు పెంచిన కవిత .. మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లో

ఇక తాజాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో దూకుడు పెంచిన ఎమ్మెల్సీ కవిత, ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు మొదలు పెట్టారు. ఎవరు ఎన్ని చేసినా టిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని, కెసిఆర్ ని ఎదుర్కోవడం ఎవరి తరం కాదని కవిత ధీటుగా సమాధానం ఇస్తున్నారు. కవిత మళ్ళీ తెలంగాణా రాజకీయాలలో యాక్టివ్ అవ్వటానికి తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి బతుకమ్మ పాటను కూడా చాలా స్పెషల్ గా తయారు చేయిస్తున్నారు. ముగ్గురు దిగ్గజాల చేతిలో తెలంగాణా జాగృతి బతుకమ్మ పాట రూపు దిద్దుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+