మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం.. కరోనాతో యశోదలో చికిత్స

కరోనా భయపెడుతోంది. ఏ లక్షణం లేకున్నా వైరస్ అంటుకుంటోంది. దీంతో ఎక్కడ చూసిన జనం బెంబేలెత్తిపోతున్నారు. గ్రామం, పట్టణం, నగరం అనే తేడా లేకుండా కరోనా విస్తరిస్తోంది. నేతలు, సినీ ప్రముఖులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. సెకండ్ వేవ్ కావడంతో వైరస్ గుర్తించడం చాలా కష్టంగా మారుతోంది.

తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. కరోనా సోకి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో మాజీ మంత్రి, బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మోత్కుపల్లి నర్సింహులుకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

motkupalli narasimhulu health is very serious

ఇటీవల మోత్కుపల్లి నర్సింహులుకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగా ఉండటంతో ఐసీయూలోకి మార్చారు. ప్రస్తుతం ఆరోగ్యం విషమంగానే ఉందని.. వెంటిలేటర్‌ మీద ఉంచి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.

Recommended Video

    INC TV - Congress YT Channel Launch మీడియా, జర్నలిస్టుల తీరును ఎత్తి చూపుతూ... గోదీ మీడియా అంటూ !!

    కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో 2,3 రోజుల వరకు వైరస్ నిర్ధారణ కావడం లేదు. ఆ లోపు వీక్‌గా ఉన్నవారిపై ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఇటీవల మాజీమంత్రి చందూలాల్ కూడా చనిపోయిన సంగతి తెలిసిందే. చాలా మంది ప్రజలు సెకండ్ వేవ్ వల్ల మృత్యువాత పడుతున్నారు. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+