Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దళితబంధు పథకం చైర్మన్‌గా మోత్కుపల్లి నర్సింహులు..? క్యాబినెట్ హోదా వెనక

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. తాజాగా మరో వ్యూహాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. 'దళితబంధు' పథకానికి వీలైనంత త్వరగా చట్టబద్ధత కల్పించాలని అనుకుంటున్నారు. అందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించాలని అనుకుంటున్నారు. దళితబంధు పథకానికి చైర్మన్‌గా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును నామినేట్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ఒకటి రెండురోజుల్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

 బీజేపీకి రాజీనామా.. కానీ

బీజేపీకి రాజీనామా.. కానీ

మోత్కుపల్లి నర్సింహులు ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేశారు. కానీ ఇంకా టీఆర్‌ఎస్‌లో చేరలేదు. ఇది వ్యూహాత్మకంగానే వాయిదా పడిందని, కొద్దిరోజులుగా కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్న మోత్కుపల్లి టీఆర్‌ఎస్‌ ఆహ్వానం విషయాన్ని ఇప్పటికే ధ్రువీకరించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 'దళిత బంధు' ప్రకటన తర్వాత విపక్షాల నుంచి వస్తున్న విమర్శలు, సవాళ్లకు మంత్రివర్గ విస్తరణ ద్వారా చెక్‌ పెట్టాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారని.. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ రాకముందే కేబినెట్‌లో మార్పులు జరగవచ్చని వెల్లడిస్తున్నాయి.

17 మందికి చాన్స్.. ఒకటి ఖాళీ

17 మందికి చాన్స్.. ఒకటి ఖాళీ

రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవలి వరకు సీఎం కేసీఆర్‌ సహా 17 మంది ఉండగా.. ఈటల రాజేందర్‌ తొలగింపు తర్వాత 16 మందితో కొనసాగుతోంది. ఇందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొప్పుల ఈశ్వర్‌ ఒక్కరే కేబినెట్‌లో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ సామాజికవర్గం ప్రాతినిధ్యం పెంచాలని.. మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. శాసనసభలో ఎస్సీ కేటగిరీలో 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 18 మంది టీఆర్‌ఎస్‌ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో ఎనిమిది మంది మాల, తొమ్మిది మంది మాదిగ సామాజిక వర్గం వారు కాగా.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నేతకాని సామాజికవర్గానికి చెందినవారు. తాజా విస్తరణలో కొత్తగా ఒకరిద్దరికి అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సండ్ర వెంకట వీరయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయని.. వారికి సంబంధించి నిఘా వర్గాల నుంచి సమాచారం సీఎంకు చేరిందని సమాచారం.

ప్రజల్లోకి నేతలు

ప్రజల్లోకి నేతలు

జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇటీవల రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు పెంచాయి. క్షేత్రస్థాయిలో కార్యాచరణను ప్రకటించాయి. పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 'దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా' పేరుతో భారీ సభ నిర్వహించగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ నెల 24 నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇటీవల బీఎస్పీలో చేరగా.. వైఎస్సార్‌టీపీ, తీన్మార్‌ మల్లన్న వంటి కొత్త రాజకీయ శక్తులు కూడా వివిధ సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. చురుగ్గా మారిన జాతీయ పార్టీలు, కొత్త రాజకీయ శక్తులకు కళ్లెం వేసేందుకు ప్రత్యేక వ్యూహం అవసరమని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే అంచనాకు వచ్చారని.. ఆయా పార్టీలు, వ్యక్తులను ఆత్మరక్షణలోకి నెట్టేలా 'దళితబంధు', మంత్రివర్గంలో ఎస్సీలకు ప్రాతినిధ్యం పెంపు వంటివాటిని తెరపైకి తేవాలని నిర్ణయించినట్టు తెలిసింది.

 అవగాహన సదస్సులు

అవగాహన సదస్సులు

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత 'దళిత బంధు' అవగాహన పేరుతో జిల్లాలు, నియోజకవర్గాల వారీగా భారీ సదస్సులు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికపైనా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తద్వారా విపక్షాల పాదయాత్రలు, సభలు, ఆందోళనా కార్యక్రమాలకు చెక్‌ పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. బీజేపీ, కాంగ్రెస్, ఇతర రాజకీయ శక్తులు విస్తృత కార్యాచరణకు దిగుతున్నాయి. అన్నీ దళిత అంశాలను లేవనెత్తుతున్నాయి. వాటిని ఆత్మరక్షణలోకి నెట్టేలా దళిత బంధు చైర్మన్, ఎస్సీలకు మంత్రి పదవులు వంటి కొత్త అస్త్రాలను సీఎం కేసీఆర్‌ తెరపైకి తెస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అవకాశమిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సీఎం లెక్కలు వేస్తున్నట్టు తెలిసింది. గతంలో మాదిరిగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మంత్రుల్లో ఒకరికి డిప్యూటీ సీఎం హోదా కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

 జీవన్మరణ సమస్య

జీవన్మరణ సమస్య

హుజురాబాద్ బై పోల్ వేళ సీరియస్ నెస్ ఎక్కువ అవుతుంది. ప్రధాన పార్టీల మధ్య విమర్శలు మరింత ముదురుతున్నాయి. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకోసమే ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే షెడ్యూల్ రాలేదు.. కానీ నియోజకవర్గంలో డబ్బు, మద్యం ఎరులై పారుతోందని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల్లో విజయం ఈటల రాజేందర్‌కు జీవన్మరణ సమస్య కాగా.. టీఆర్ఎస్ కూడా ప్రతిష్టత్మకంగానే తీసుకుంది. కాంగ్రెస్ కూడా అదేవిధంగా పోటీ చేయనుంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపనుంది. బై పోల్ ఏమో కానీ.. నియోజకవర్గంలో వందల కోట్లను అభ్యర్థులు గుమ్మరించే ఛాన్స్ ఉంది. మద్యం ఏరులై పారగా.. నగదు కూడా ఎక్కువగానే ఇస్తున్నారు.

 విపక్షాల గుర్రు

విపక్షాల గుర్రు

మరోవైపు హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. బై పోల్ చుట్టూ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి.

 అనుమానాలు

అనుమానాలు

దళిత బంధు పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నిక తర్వాత కూడా పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నందున.. పథకం తెరపైకి తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో నిధులు కూడా రిలీజ్ చేశారు. అయితే మిగతా ప్రాంతాల సంగతి ఏంటీ అనే ప్రశ్న వస్తోంది. బై పోల్ కోసం హుజురాబాద్‌లో కొందరినీ ఎంపిక చేసి.. ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరీ మిగతా ప్రాంతాల సంగతి ఏంటీ అనేది ఇక్కడ ప్రశ్న.. రాష్ట్రంలో గల నిరుపేద దళితులు.. దళిత బంధు పథకం కోసం ఆప్లై చేసుకోవాలా... నిజంగానే నగదు ఇస్తారా అనే సందేహాం ప్రతీ ఒక్కరిలో మెదలుతుంది. కానీ దీనికి సంబంధించి సమాధానం కావాలంటే కాలామే చెప్పాలి. ఎందుకంటే బై పోల్ జరిగే వరకు ఏ విషయంపై క్లారిటీ ఉండదు. ఎన్నిక, ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు.. ఎందుకంటే పాలకులు బడుగు, బలహీనవర్గాలను పట్టించుకోవడం అరుదుగానే ఉంటుంది. మరీ దళిత బంధు విషయంలో అలా జరుగుతుందా.. లేదో చూడాలీ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+