లాక్‌డౌన్‌పై కేసీఆర్ క్లారిటీ.. వ్యాక్సిన్‌పై ఉత్పత్తి సంస్థలతో మాట్లాడాలని సజెస్ట్..

కరోనా కేసులు, మరణాలు, తీసుకోవాల్సిన అంశాలపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రగతి భవన్‌లో దాదాపు నాలుగు గంటల పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అన్ని ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.

ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్లు, ఇంజక్షన్లు అన్నీ అందుబాటులో ఉండాలని సూచించారు. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో ఉత్పత్తి సంస్థలతో మాట్లాడి, త్వరితగతిన రాష్ట్రానికి వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ నెల 8తో నైట్ కర్ఫ్యూ ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి కర్ఫ్యూను పొడగిస్తారా లేదా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Recommended Video

    KCR కి V. Hanumantha Rao లేఖ, మల్లారెడ్డి, పల్లా, పువ్వాడలపై చర్యలేవి?
    no lockdown in the telangana state cm kcr said to media.

    రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోమని సీఎం కేసీఆర్ తెలిపారు. కరోనా కేసులను నిరోధించడానికి లాక్‌డౌన్ పరిష్కారం కాదని ఆయన అన్నారు. లాక్‌డౌన్ వల్ల ఆర్థికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించినా కేసులు తగ్గడం లేదని చెప్పారు. దానితో జనజీవనం స్థంభించిపోతుందని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో గల ప్రస్తుత పరిస్థితులపై ప్రగతి భవన్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు, తీసుకోవాల్సిన అంశాలపై దాదాపు 4 గంటల పాటు అధికారులతో చర్చించి.. తర్వాత వారికి కీలక ఆదేశాలు జారీచేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+