గ్రేటర్‌లో మారని మేయర్ తీరు, డిప్యూటీ మేయర్ కూడా.. కేటీఆర్ అసంతృప్తి..?

గ్రేటర్ పాలకమండలి జరిగి నేటికి సరిగ్గా ఏడాది.. ఈ సంవత్సరంలో పాలకమండలి ఒరగబెట్టింది ఏమీ లేదు. గతంలో చేసిన పనుల వద్ద ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్పా.. చేసిందేమీ లేదు. ఏడాది పూర్తయిన నేపథ్యంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డి బుక్‌లెట్‌ విడుదల చేశారు. గతంలో ప్రతిపాదించిన, చేపట్టినవి మినహా.. ఒక్కటి కూడా ప్రస్తుత పాలకమండలి హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు బుక్‌లెట్‌లో లేవు.

గార్బేజ్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పటికీ సఫలం కాలేదు. చెత్త సేకరణ రుసుం ఇష్టారాజ్యంగా వసూలు చేస్తోన్నా.. పట్టించుకునే నాథుడే లేరు. గతంలో రోజూ స్వీపింగ్‌ జరగగా, కొన్ని నెలలుగా పలు కాలనీల్లో రెండు, మూడు రోజులకోమారు రోడ్లు ఊడుస్తున్నారు. ఇక అధ్వాన రహదారులను పట్టించుకునే వారే లేరు.

ఏటా రూ.8 కోట్లు.. అయినా..

ఏటా రూ.8 కోట్లు.. అయినా..

ప్రైవేట్‌కు అప్పగించిన మెయిన్‌ రోడ్లు జీహెచ్‌ఎంసీ అధీనంలో ఉన్న రహదారులు పరిస్థితి చెప్పక్కర్లేదు. ఏటా రూ.8 కోట్ల వరకు ఖర్చు చేస్తోన్నా.. దోమల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. పట్టణ ప్రణాళికా, హెల్త్‌ అండ్‌ శానిటేషన్‌, ఇంజనీరింగ్‌ విభాగాల్లో అవినీతి నియంత్రణలో పాలకమండలి పూర్తిగా విఫలమైంది. ఏడాదైనా స్థానిక సంస్థల్లో కీలకమైన వార్డు కమిటీల ఏర్పాటు, కో ఆప్షన్‌ సభ్యుల నియామకం పాలకమండలి ఇప్పటికీ పూర్తి చేయలేదు. కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక కోసం గతంలో దరఖాస్తులు ఆహ్వానించి ప్రకటన విత్ డ్రా చేసుకున్నారు.

మారని మేయర్ తీరు

మారని మేయర్ తీరు

ఇటు మేయర్‌ విజయలక్ష్మి తీరు ఫస్ట్ నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడి మేయర్‌గా ఎంపిక కాకముందే.. అప్పటి షేక్‌పేట తహశీల్దార్‌ విషయంలో విజయలక్ష్మి వ్యవహరించిన తీరు విమర్శలకు గురిచేస్తోంది. ప్రతిపక్షాలకే కాదు.. సొంత పార్టీ కార్పొరేటర్లకు కూడా అందుబాటులో ఉండరనే అపవాదును మూటకట్టుకున్నారు. కానీ ఇటీవల మాత్రం మార్పు కనిపిస్తోంది.

సతుల వెంట పతులు ఉండొద్దని గతంలో పురపాలక మంత్రి కేటీఆర్‌ సూచించినా.. డిప్యూటీ మేయర్‌ శ్రీలత పట్టన్నట్టు వ్యవహరిస్తుంటారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన చాలా మంది మహిళా కార్పొరేటర్ల వెంట కార్యక్రమాల్లో వారి భర్తలు పాల్గొంటున్నారు. అప్పుడప్పుడూ హడావిడి చేయడం తప్ప ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కార్పొరేటర్లు ప్రజాసమస్యల పరిష్కారంపై చేస్తోన్న ప్రయత్నం నామమాత్రమే. ముగ్గురు ఉన్న కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఉన్నారా..? లేరా..? అన్నట్లుగా ఉంది.

మహిళలే కదా.. మరీ

మహిళలే కదా.. మరీ

స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళలకు అవకాశం కల్పించాలని నిర్ణయించిన ప్రభుత్వం జీహెచ్‌ఎంసీలోనూ అదే విధానం అమలు చేసింది. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠాలను మహిళలకు అప్పగించింది. కౌన్సిల్‌లోనూ 50 శాతం కంటే ఎక్కువగా మహిళా సభ్యులు ఉన్నారు. మహిళా సాధికారత కోసం ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. మహిళా పొదుపు సంఘాలకు బ్యాంకుల ద్వారా మంజూరు చేసే రుణాలను పెంచే ఆలోచన కూడా పాలకమండలి చేయలేదు. దీంతో ప్రస్తుత పాలకమండలి ఏడాదిలో చేసిందేమీ లేదనే విమర్శలను ఎదుర్కొంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+