హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు సెలవు: వినాయక నిమజ్జనం, 3 జిల్లాల్లో.. నవంబర్ 12వ తేదీన వర్కింగ్ డే

|
Google Oneindia TeluguNews

9 రోజులు పూజలు అందుకున్న గణనాథుడు రేపు (శుక్రవారం) గంగమ్మ ఒడికి చేరనున్నాడు. తెలంగాణ ప్రభుత్వం సెలవును ప్రకటించింది. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో పాఠ‌శాల‌ల‌కు సెల‌వు అనౌన్స్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్త‌ర్వులు జారీ చేశారు.

హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌ల్కాజిగిరి జిల్లాలో పాఠ‌శాల‌ల‌కు శుక్ర‌వారం సెల‌వు ఇచ్చారు. రేప‌టి ప‌ని దినం.. న‌వంబ‌ర్‌ 12తో భర్తీ చేస్తారు. ఆ రోజు రెండో శనివారం కాగా.. సెల‌వు దినం ప‌ని దినంగా ప్ర‌క‌టించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది.

ocassion of the ganesh immersion friday holiday

మ‌రోవైపు రేప‌టి ప‌ని దినాన్ని భ‌ర్తీ చేస్తూ ఎల్లుండి (రెండో శ‌నివారం) త‌ర‌గ‌తులు నిర్వ‌హించేలా ప‌లు పాఠ‌శాల‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు కాబట్టి అలా డిసిషన్ తీసుకున్నాయి. ఇటు మిగతా జిల్లాల్లో రోజును బట్టి గణనాథుడిని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం రోజు స్కూల్‌కు సెలవు మంజూరు చేస్తారు. నవంబర్ 12వ తేదీన తిరిగి పనిచేస్తారు.

ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మిగతా గణనాథులను సమీపంలో గల చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారు. ఆయా చోట్ల కూడా పోలీసులను మొహరించారు. నిమజ్జనం సందర్భంగా అవాంచనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు.

English summary
ocassion of the ganesh immersion friday is the holiday. chief secretary somesh kumar orders released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X