Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆన్ లైన్ అనర్థం.!పిల్లల మనోవికాసానికి విఘాతమేనా.?తోటి విద్యార్దులతో కలవకపోతే పరిపక్వత ఎలా సాధ్యం.?

హైదరాబాద్ : కరోనా మహమ్మారి విద్యావ్యవస్థతో విద్యార్థులపైన తీవ్ర ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. విద్యార్థులనైతే ఏకంగా స్కూల్స్ ని మర్చిపోయేలా చేసింది కరోనా. కరోనా బీరిన పడకుండా ఉండేందుకు, విద్యాసంవత్సరం వృదా కాకుండా ఉండేందుకు ఆన్ లైన్ క్లాసులను ప్రవేశపెట్టాయి విద్యాసంస్థలు. అనేక కాలేజీల్లో, పాఠశాలల్లో ఇవే ఆన్ క్లాసుల ద్వారా విద్యాబోధన కొనసిగిస్తున్నయి వివిధ విద్యాసంస్థలు. దీంతో విద్యార్థులు కట్టాల్సిన ఫీజులకు, టీచర్లు కంప్లీట్ చేయాల్సిన సెలబస్ కు ఎలాంటి ఢోకా లేదు గానీ విద్యార్థుల మానసిక పరిపక్వతగురించే సందేహాలు రేకెత్తుతున్నాయి.

 ఆన్ లైన్ క్లాసుల వల్ల ప్రయెజనమా..

ఆన్ లైన్ క్లాసుల వల్ల ప్రయెజనమా..

ప్రధానంగా 5నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు లోక జ్ఞానాన్ని ఆదే సమయంలో తెలుసుకుంటారు. స్కూలుకు వెళ్లడం భిన్న మనస్థత్వాల విద్యార్థులతో స్నేహం చేయడం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం వంటి పరిణామాలు అన్ని అదే వయసులో చోటుచేసుకుంటాయి. ఆ సమయంలో పిల్లల మీద చిన్నపాటి నిఘా ఉంచి పూర్తి స్వేచ్చను ఇస్తే సమాజాన్ని చూసి ఎంతో నేర్చుకుంటారనే అభిప్రాయాలను మానసిక నిపుణులు వ్యక్తం చేస్తుంటారు.

కానీ ప్రస్తుతం జరుగుతుందేంటి..? మానసికంగా ఎదగాల్సిన పిల్లలను పరిస్దితులు ఎదగనిస్తున్నాయా..? ముఖ్యంగా ఎంతో నేర్చుకోవాల్సిన పాఠశాలలను వదిలి నాలుగు గోడల మధ్య తరగతులు వినడం శ్రేయస్కరమేనా..?

పాఠశాలను మర్చిపోయేలా చేస్తున్న ఆన్ లైన్ క్లాసులు..

పాఠశాలను మర్చిపోయేలా చేస్తున్న ఆన్ లైన్ క్లాసులు..

ఏదేమైనా ఆన్ లైన్ క్లాసులపై దల్లిదండ్రుల్లో గానీ, విద్యార్థుల్లో గానీ ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు మూడు విద్యా సంవత్సరాలుగా విద్యార్థులు ఆన్ లైన్ క్లాసుల పేరుతో నాలుగు గోడల మద్యనే పరిమితమయ్యరు. పుస్తకాలు, బ్యాగులు, పాఠశాల, స్నేహితులు అన్నీ మర్చిపోయే ప్రమాదరక పరిస్థితిలోకి వెళ్లిపోయారు.

క్లాస్ రూంలో నైతే ఒక అంశం పట్ల రకరకాల అభిప్రాయాలను షేర్ చేసుకునే అవకాశం ఉండేది, పాఠం వింటున్నప్పుడు వచ్చే సందేహాలను ఇమ్మిడియట్ గా టీచర్లను అడిగి నివృత్తి చేసుకునే పరిస్థితులు ఉండేవి. టీచర్లను అడగని సందర్బాల్లో స్నేహితులతో షేర్ చేసుకునే అవకాశం ఉండేది. మరి ఆన్ లైన్ క్లాసులతో ప్రస్తుతం విద్యార్ధులకు ఆ అవకాశం ఉందా..?

 గ్రౌండ్ లో నెట్ ప్రాక్టీస్ లేదు..

గ్రౌండ్ లో నెట్ ప్రాక్టీస్ లేదు..

కాగా మానసికంగా ఎదాగాల్సిన చిరు ప్రాయంలో చిన్న పిల్లలకు అదే పనిగా ఆన్ లైన్ క్లాసులలో పాల్గొనాల్సి వస్తే పరిస్థితులు దారుణంగా తయారవుతాయనే అబిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పిల్లల మనోవికాసం, మానసిక పరిపక్వతకు విఘాతం కలుగుతుందనే భావన కూడా ఏర్పడుతోంది.

నవ్వుతూ, తుళ్ళుతూ, కేరింతలు కొడుతూ తోటి విద్యార్థులతో చదువును కొనసాగించాల్సిన చిన్నారులు ల్యాప్ టాప్ లకు, ట్యాబ్ లకు లేదా స్మార్ట్ ఫోన్లకు పరిమితమైతే వాళ్ల మానసిక వికాసం ఎలా సాద్యమవుతుందనే సందేహాలు తల్లిదండ్రుల నుండి ఇప్పుడిప్పుడే వ్యక్తం అవుతున్నాయి. ఆన్ లైన్ తరగతులతో కలిగే ప్రయోజనం కన్నా అనర్థాలే ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు తల్లి దండ్రులు.

స్నేహితులతో కలవరు..

స్నేహితులతో కలవరు..

కాగా కోవిడ్ నియమాలు కఠినంగా అమలు చేస్తూనే మానసిక నిపుణులు, వైద్యుల సలహాల మేరకు పాఠశాల యాజమాన్యాలు తరగతుల నిర్వహణ అంశంలో కార్యాచరణ రూపొందించుకోవాలనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా చిన్న పిల్లలు ఒంటరి తనానికి, స్మార్ట్ ఫోన్లకి అలవాటైతే ఆతర్వాత జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

చిన్న పిల్లలను తోటి పిల్లతో స్వేచ్చగా వదిలేస్తేనే వారిలో వారిలో మానసిక పరిపక్వత వస్తుందని, తల్లింద్రుల దగ్గర వ్యక్తం చేయలేని స్వతంత్ర్య భావాలను స్నేహితులతో షేర్ చేసుకోవడం సమజంగా జరిగిపోయే ప్రక్రియ. మరి పిల్లలకు అలాంటి వాతావరణం కల్పించకుడా కేవలం క్లాసులు, తరగతులు, పాస్ మార్కుల వల్ల ఏంటి ప్రయోజనమనే చర్చ జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+