సత్వర వృద్ది, పురపాలనపై ప్రణాళికలు రూపొందించాలి..!అదికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు..!!

హైదరాబాద్: మంత్రి పదవి చేపట్టి ఇరవై నాలుగు గంటలు కాకముందే మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పని మొదలెట్టేసారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే పురపాలక శాఖ ఉన్నతాదికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పండగలు ఉండడంతో పాటు, వినాయక నిమజ్జన కార్యక్రమం ఉండడంతో అదికారులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ శాఖకు సంబంధించి ఏ ఒక్క అదికారి కూడా అలసత్వం వహించరాదని ఆయన కోరారు.

నిమజ్జన కార్యక్రమంలో అందరూ అప్రమత్తంగా పనిచేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వ్యవహరిస్తూ భక్తులకు గానీ, నిమజ్జనానికి తరలి వస్తున్న ప్రజానికానికి కానీ ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా చూడాలని దిశా నిర్దేశం చేసారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మంచినీరు, తాత్కాలిక మొబైల్ టాయిలెట్లు, విద్యుత్, వైద్య సదుపాయాలు, మైక్ లో ప్రకటనలు, పారిశుద్యం, తదితర రంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వచ్చంద సంస్థల సేవలను కూడా ఉపయోగించుకోవాలని సలహా ఇచ్చారు మంత్రి కేటీఆర్.

Plans should be created on quick enhancement and progovernance..! says ktr

పురపాలక శాఖ మంత్రిగా రెండవసారి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సోమవారం పురపాలకశాఖ విభాగాధిపతులతో మంత్రి కే.టీ. రామారావు సమీక్ష నిర్వహించారు. మసాబ్ ట్యాంక్ లోని పురపాలక శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, సంచాలకులు శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రస్తుతం ఆయా విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలపైన మంత్రి విభాగ అధిపతులకు దిశానిర్దేశం చేశారు. ఒకటి రెండు రోజుల్లో మళ్లీ సమావేశం అవుతానని తెలిపిన కేటీఆర్, ప్రతి విభాగం తన కార్యక్రమాల పురోగతి, భవిష్యత్తు ప్రాధాన్యతలపైన ఒక నివేదిక సమర్పించాలని కోరారు. నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రి కేటీఆర్ కు మొక్కను అందజేసి విభాగాధిపతులు శుభాకాంక్షలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+