సికింద్రాబాద్-విశాఖ ‘వందేభారత్’ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఇది 'ఈజ్ ఆఫ్ లివింగ్'ని మెరుగుపరుస్తుంది, పర్యాటకాన్ని పెంచుతుంది, ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది అని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి సంస్కృతి, భాగస్వామ్య వారసత్వాన్ని కలుపుతుందని అన్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు రైల్వే శాఖ మంత్రి అశ్వి ని వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషస్టేన్‌ను పర్యటించారు.
Glad to flag off Vande Bharat Express between Secunderabad and Visakhapatnam. It will enhance 'Ease of Living', boost tourism and benefit the economy. https://t.co/FadvxI0ZNQ
— Narendra Modi (@narendramodi) January 15, 2023
అధికారులతో కలిసి రైల్వే స్టేషన్‌లో పరిశీలించి ఏర్పాట్లు సమీక్షించారు. ఆనంతరం కేంద్ర మంత్రులు వందేభారత్ రైలులోకి వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆధునిక సాంకేతికతతో వందేభారత్ రైలు రూపకల్పన జరిగిందని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఉభయ రాష్ట్రా ల ప్రజలకు సంక్రాంతి కానుకగా వందే భారత్ రైలును కేంద్రం ప్రారంభిస్తోందని తెలిపారు.
All set for the launch:
— G Kishan Reddy (@kishanreddybjp) January 15, 2023
Hon’ble Prime Minister Shri @NarendraModi to Flag Off Telangana’s First #VandeBharat Express, shorty via video conferencing.#RailInfra4Telangana pic.twitter.com/O2SizSDpfW
కాగా, వందేభారత్ రైలులో 16 బోగీలు ఉంటాయి. అందులో 14 చైర్ కార్ బోగీలు, మరో రెండు ఎగ్జీక్యూ గ్జీ టీవ్ చైర్కార్ బోగీలుంటాయి. మొత్తం గా రైలులో 1128 మంది ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. ఆదివారం మినహా వారంలో ఆరు రోజులు ఈ రైలు సికింద్రాబాద్-విశాఖల మధ్య పరుగులు పెడుతుందని వివరించారు. మెట్రో రైల్ తరహాలో స్లైండింగ్ తలుపులు, ప్రయాణికుల భద్రత, సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు.
సీసీటీవీ కెమెరాలు, రీడింగ్ లైట్లు, అత్యవసర పరిస్థితుస్థిల్లో రైల్ సిబ్బందితో మాట్లాడేందుకు ప్రత్యేకంగా అలారం బటన్ ఏర్పాటు చేశారు. వందేభారత్ రైలు ఆధునిక సౌకర్యాలతో ఎంతో ఆకర్షణీయంగా ఉండటంతో ప్రయాణికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు బాగున్నాయని ప్రయాణం సమయం చాలా వరకు ఆదా అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications