జర్నలిస్ట్ రఘు అరెస్ట్.. వరస కథనాలతోనేనా..? తొలుత కిడ్నాప్ అని వార్తలు..

జర్నలిస్ట్​, యాంకర్​ రఘును పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత ఆయనను కిడ్నాప్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాతే పోలీసులు తీసుకెళ్లారని నిర్దారణ జరిగింది. రఘు మిస్సింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మల్కాజిగిరిలోని ఆయన ఇంటి సమీపంలో నుంచి రఘును తీసుకెళ్లారు. తొలుత గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్​ చేసినట్టు సమాచారం అందింది. తర్వాత పోలీసులు అరెస్ట్​ చేసినట్టు తెలిసింది.

సంచలన కథనాలు

సంచలన కథనాలు


ఇటీవల రఘు పలు సంచలన కథనాలను ప్రసారం చేశీరు. తొలివెలుగు యూట్యూబ్​ చానల్​లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వస్తున్నాయి. మరోవైపు తెలంగాణ వాదులను, టీఆర్​ఎస్​ను గట్టిగా వ్యతిరేకించే వాళ్లను రఘు నిత్యం ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన ఒక్కసారిగా కనిపించకుండా పోవడం చర్చకు దారితీసింది.

ఇందుకేనా..?

ఇందుకేనా..?


కోకాపేట కాందిశీకుల భూమి, ఐకియా ముందు గల భూమి, ఐడీపీల్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై ఇటీవల తొలివెలుగు యూట్యూబ్ చానెల్‌లో కథనాలు ప్రసారం అయ్యాయి. మరోవైపు గతంలో సూర్యాపేట జిల్లా గుర్రంపోడులో అసైన్డ్​ భూములు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కూడా గుర్రంపోడు వెళ్లారు. అక్కడి ఎమ్మెల్యే ఈ భూములను కబ్జా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే బీజేపీ నేతలు గుర్రంపోడు వెళ్లినప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సదరు న్యూస్​ను కవర్​ చేసిన జర్నలిస్ట్​ రఘుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టి సమాచారం.

అరెస్ట్‌కు కారణమిదే..

అరెస్ట్‌కు కారణమిదే..

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ జరిగింది. ఈ కేసులో నిందితుడిగా జర్నలిస్ట్ రఘు ఉన్నారు. ఆయనను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత హుజుర్‌ నగర్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. తర్వాత అతనిని హుజూర్ నగర్ జైలుకు తరలించారు. జర్నలిస్ట్‌లలో డేరింగ్ అండ్ డాషింగ్ గా రఘుకి పేరుంది. అంతకుముందు రఘు మోజో టీవీలో పనిచేశారు. 10 టీవీ.. రాజ్ న్యూస్‌లో కూడా వర్క్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+