అమిత్ షాపై హైదరాబాద్‌లో కేసు నమోదు
హైదరాబాద్: కేంద్రహోంమంత్రి అమిత్‌షాపై హైదరాబాద్‌లో పోలీస్ కేసు నమోదయ్యింది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్ధతుగా మే 1వ తేదీన లాల్ దర్వాజ నుంచి సుధా టాకీస్ వరకు నిర్వహించిన రోడ్‌షోలో ఎన్నికల నిబంధనలను ఉల్లఘించారని కాంగ్రెస్ నేత నిరంజన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మోఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు.
అమిత్ షాతోపాటు బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీ లత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, స్థానిక నేత యమన్ సింగ్‌పై కూడా కేసు నమోదు చేశారు. అమిత్‌షా నిర్వహించిన రోడ్‌షోలో చిన్నపిల్లలు ఉన్నారని, వారిని బీజేపీ ప్రచారానికి వినియోగించుకున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఇదంతా ఎన్నికల నిబంధనలను ఉల్లఘించినట్లేనని నిరంజన్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అమిత్ షాపై ఫేక్ వీడియో: ఆ ఐదుగురిపై కఠిన చర్యలొద్దన్న హైకోర్టు
కేంద్రమంత్రి అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసులో హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఐదుగురు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు నిందితులుగా చేర్చిన మన్న సతీష్ ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఢిల్లీ పోలీసులను ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అయితే, విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా.. ఐదుగురు నిందితులకు కోర్టు రూ.10వేలతో ఇద్దరు పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం, శుక్రవారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరవ్వాలని ఆదేశించింది.
బీజేపీ నేత ఫిర్యాదుతో ఐదుగురి అరెస్ట్
బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంలో పని చేస్తున్న పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, పెట్టం నవీన్, ఆస్మా తస్లీమ్, కోయా గీతలను అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు సెల్ఫోన్లు, రెండు ల్యాప్ టాప్‌లు, రెండు సీపీయూలు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు పలు అంశాలను గుర్తించినట్లు సమాచారం.
కాగా, ఏప్రిల్ 23న మెదక్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. అయితే రిజర్వేషన్లకు సంబంధించి అమిత్ షా మాట్లాడినట్లు మార్ఫింగ్ చేసిన వీడియో ప్రధాన నిందితుడు పెండ్యాల వంశీకృష్ణకు వాట్సాప్‌కి వచ్చింది. ఆ వీడియోను పలు వాట్సాప్ గ్రూపులకు అతను ఫార్వర్డ్ చేయడమే కాకుండా, కాంగ్రెస్ అధికారిక ఎక్స్(ట్విటర్) ఖాతాలో కూడా పోస్ట్ చేశాడు. మిగిలిన వారు కూడా వారి వ్యక్తిగత ఎక్స్ ఖాతాల్లో పంచుకున్నారు. అయితే, ఈ వీడియో ఫేక్ కావడంతో ట్విట్టర్ దాన్ని డిలీట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
-
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications