మంత్రి మల్లారెడ్డిపై కేసు: ఎక్కడ, ఎందుకంటే..?
తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూ కబ్జాకుకు సంబంధించి కేసు ఫైల్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని దుండిగల్ పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. అయితే మంత్రిపై కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
కుత్బుల్లాపూర్ మండలం సురారంలో భూమి కబ్జా చేయించారని శ్యామల దేవి అనే మహిళ ఫిర్యాదు చేశారు. తన స్థలంలో మంత్రి అనుచరులు ప్రహరీ గోడ నిర్మించారని ఆమె పేర్కొన్నారు. అంతేకాదు తన లాయర్‌ను కూడా తమ వైపు తిప్పుకున్నారని ఆమె ఆరోపించారు. భూమి కొనుగోలుకు సంబంధించి తప్పుడు అగ్రిమెంట్ సృష్టించారని ఫిర్యాదులో వివరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కానీ స్థానికంగా కేసు కలకలం నెలకొంది. మంత్రి సదరు మహిళ ఆరోపణలు చేయడం చర్చకు దారితీసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. అయితే మంత్రిపై కేసు అనే అంశం దుమారం రేపుతోంది. దీనిపై మంత్రి, ఆయన అనుచరులు గానీ స్పందించలేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, గ్రేటర్‌లో అనుకున్నన్నీ సీట్లు రాక టీఆర్ఎస్ ఇబ్బందుల్లో ఉంది. ఈ క్రమంలో క్యాబినెట్ మంత్రిపై కేసు నమోదవడం ఆ పార్టీకి కొంచెం ఇబ్బందిగా మారింది. ఇటు మరో మంత్రిపై కూడా రాసలీలల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications