నుమాయిష్ తిరిగి ప్రారంభం.. మళ్లీ 46 రోజులే.. ఎప్పటినుంచి అంటే..
నుమాయిష్ తిరిగి ప్రారంభం కాబోతుంది. ఈ నెల 25వ తేదీ నుంచి 46 రోజులపాటు కొనసాగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) పునఃప్రారంభించేందుకు సొసైటీ పాలకవర్గం చర్యలు తీసుకుంటుంది. వాస్తవానికి నుమాయిష్ జనవరి 1వ తేదీన ప్రారంభం అయ్యింది. ఈ సారి కూడా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా లాంఛనంగా 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభించారు. మరుసటి రోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవిడ్ గైడ్ లైన్స్ జారీ చేయడంతో మూసివేశారు,
తాజాగా ఆ కొవిడ్ నిబంధనలను సడలించారు. దీంతో ఎగ్జిబిషన్ నిర్వహణపై సొసైటీ పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ నెల 25వ తేదీన ప్రారంభించి 46 రోజులపాటు ఎగ్జిబిషన్‌ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు అందగానే నుమాయిష్ ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటిస్తామని సొసైటీ సెక్రటరీ ఆదిత్యమార్గం తెలిపారు. ఈ సారి నుమాయిష్ 1,600 స్టాళ్లతో కొనసాగించేందుకు మైదానంలో ఏర్పాట్లు చేశారు.

కరోనా వల్ల మూసేసినా స్టాళ్లను అలాగే ఉంచారు. అయితే కరోనా ఎప్పుడు తగ్గుతుందో... నుమాయిష్ ఎప్పుడు ప్రారంభం అవుతుందోనని ఆందోళనకు గురైన స్టాళ్ల నిర్వాహకులు దాదాపు 30 శాతం మంది తమ డబ్బులను తిరిగి తీసుకొని వెళ్లిపోయారు. మిగిలిన 70 శాతం స్టాళ్ల నిర్వాహకులు నుమాయిష్ ఎప్పుడు ప్రారంభిస్తే అప్పుడు వ్యాపారాలు నిర్వహిస్తామని.. ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోకుండా వెళ్లిపోయారు. దీంతో సొసైటీ పాలకవర్గం మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల నిర్వాహకులకు ఎగ్జిబిషన్‌ను తిరిగి ప్రారంభిస్తామని, తమ వస్తువులను తెచ్చుకోవచ్చని ఆహ్వానాలు, ఫోన్ మెసేజ్‌లను పంపుతున్నారు.
కరోనా వల్ల నుమాయిష్ కళ తప్పింది. ఇదివరకు అందరూ వెళ్లి.. తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసేవారు. అయితే కరోనా వల్ల ఆ పరిస్థితి లేదు. ఈ సారి ప్రారంభం అయినా.. మూసివేశారు. ఇప్పుడు పరిస్థితి సద్దుమణిగింది. దాంతో పున: ప్రారంభిస్తున్నారు. సో ఎంచక్కా వెళ్లి.. కావలసిన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కలిగింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications