హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో విద్యుత్ చార్జీల మోత..? పెంచేందుకు డిస్కంలు రెడీ, సర్కార్ అనుమతే తరువాయి

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ప్రభావమో ఏమో కానీ మళ్లీ చార్జీల పెంపుపై కేసీఆర్ సర్కార్ ఫోకస్ చేసింది. ఇప్పటికే ఆర్టీసీ చార్జీలను పెంచుతామని సామాన్యులను వణికిస్తోంది. సరేలే అని ఊరుకుంటే.. మరో పిడుగులాంటి వార్త చెప్పింది. అదే కరెంట్ చార్జీల వాత తప్పదని సంకేతాలను ఇచ్చింది. చార్జీల పెంపునకు అనుగుణంగా ప్రజలను సంసిద్దులను చేస్తోంది.

కరెంట్ బిల్లు షాక్

కరెంట్ బిల్లు షాక్

కరెంట్‌ బిల్లు పెంపుతో షాక్‌ ఇచ్చేందుకు తెలంగాణ డిస్కంలు రెడీ అయ్యాయి. దీనికి ప్రభుత్వం అనుమతించడమే మిగిలి ఉంది. ఏళ్ల తరబడి పెరగకుండా ఉన్న ప్రాథమిక చార్జీలను పెంచే అవకాశాలు ఉన్నాయి. ఎల్‌టి వన్‌ ఏ కేటగిరీలో 50 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగిస్తే.. యూనిట్‌కు రూపాయి 45 పైసలు చొప్పున ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. మొదటి నుంచి ఈ చార్జీల్లో ఎలాంటి మార్పులేదు. ఈ సారి స్వల్ప పెంపు ఉండొచ్చు. రూపాయి 45 పైసలుగా ఉన్న యూనిట్‌ ధరను.. 1.50 రూపాయి చేసే ఛాన్స్ ఉంది. యూనిట్‌పై ఐదు పైసలు పెరగనుంది.

పెరగనున్న రూ.3

పెరగనున్న రూ.3


నెల బిల్లులో మూడు రూపాయలు పెరుగుతుంది. ఇది పెద్ద భారం కాదనే అధికారులు అంటున్నారు. స్లాబుల్లో మార్పుతో, డిమాండ్‌ చార్జీల పెంపుతో పరోక్ష ఆదాయం పెరగవచ్చని డిస్కమ్స్‌ భావిస్తున్నాయి. విద్యుత్‌ డిస్కం మరింత నష్టాల ఊబిలోకి వెళ్లకుండా ఉండాలంటే ఈ సారి చార్జీల పెంపు తప్పదని అనిపిస్తోంది. దేశంలో కరెంట్‌ సరఫరాలో రాష్ట్రాలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో మాత్రం విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

వడ్డన తప్పనిసరి

వడ్డన తప్పనిసరి

తెలంగాణ విద్యుత్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలంటే వడ్డన తప్పనిసరి అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌తో పోలిస్తే పారిశ్రామిక విద్యుత్‌ చార్జీలు తెలంగాణలో ఎక్కువే. దీంతో ఏపీ చార్జీలకు సమానంగా ఉండేలా పారిశ్రామిక చార్జీలు తగ్గించే అవకాశం ఉంది. దీనికి తోడు డిస్కంల అప్పులను ఉదయ్‌ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుతానికి డిస్కంలకు అధిక వడ్డీల భారం తప్పి.. విద్యుత్‌ లభ్యత పెరిగింది. విద్యుత్‌ సరఫరా పెరగడంతో డిస్కంల విద్యుత్‌ వ్యాపారం బాగా కలిసివస్తోంది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల మేరకు సబ్సిడీలు సకాలంలో అందజేయడం లేదని తెలుస్తోంది.

Recommended Video

Chandrababu Crying ప్రెస్ మీట్లోనే ఏడ్చేసిన చంద్రబాబు CBN Challenge In AP Assembly | Oneindia Telugu
పెట్రో ధరల వాత

పెట్రో ధరల వాత


ఇప్పటికే ఆర్టీసీ చార్జీల మోత సామాన్యుడు భయపడుతున్నాడు. ఇక కరెంట్ చార్జీల పెంపు భారంతో నోరెళ్లబెడుతున్నాడు. ఛార్జీల మోత తప్పదా అని అంటున్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇలా చేయడం షరా మములేనని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పెట్రో ధరలతో అల్లాడుతున్న సంగతి తెలిసిందే. దానికి ఈ చార్జీల వాత తోడయ్యాయి.

English summary
power charges may be increase in the telangana state. monthly minimum 3 rupees will be increased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X