స్పా ముసుగులో సెక్స్ దందా.... ముఠా గుట్టు రట్టు చేసిన కేపీహెచ్ బీ పోలీసులు
భాగ్యనగరి కేంద్రంగా హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. బ్యూటీపార్లర్లు, స్పా లను అడ్డాలుగా చేసుకుని వ్యభిచార దందా యథేచ్ఛగా సాగుతోంది. తాజాగా కెపీహెచ్ బీ ప్రాంతంలోని ఒక స్పా లో అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు .

స్పా ముసుగులో అమ్మాయిలతో సెక్స్ దందా
హైదరాబాద్ లో ఈ ఏరియా, ఆ ఏరియా అని లేకుండా అన్ని చోట్ల యధేచ్చగా వ్యభిచారం జరుగుతుంది. తాజాగా అమాయకమైన అమ్మాయిలని తమ ట్రాప్ లోకి లాగి వారితో వ్యభిచారం దందా చేయిస్తూ డబ్బులు దండుకుంటున్నారు ఒక స్పా నిర్వాహకులు . స్పా ముసుగులో అమ్మాయిలతో సెక్స్ దందా చేస్తున్నారు.ఇక ఈ సెక్స్ రాకెట్ పై సమాచారంతో దాడి చేసిన పోలీసులు అక్కడ ఉన్న ఇద్దరు నిర్వాహకులు ఆరుగురు విటులను అరెస్ట్ చేసారు. అలాగే అక్కడ ఉన్న ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

కేపీహెచ్ బీలో స్పా పై పోలీసుల దాడి
కూకట్ పల్లికి చెందిన వెంపటి సతీష్ అనే వ్యక్తి కేపీహెచ్ బీ కాలనీ ఆరో ఫేజ్లో గ్లోవెల్ ఫ్యామిలీ స్పా అండ్ సెలూన్ సెంటర్ ని నడుపుతున్నాడు. అక్కడికి వచ్చే కస్టమర్లకు మసాజ్ చేసేందుకు అమ్మాయిలను ఎరగా వేస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వారిని ప్రలోభాలకు గురిచేసి వారితో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేయిస్తున్నాడు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న కేపీహెచ్ బీ పోలీసులు అకస్మాత్తుగా స్పా సెంటర్ పై దాడి చేశారు.

నిర్వాహకులను, విటులను, సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
నిర్వాహకులు సతీశ్ , ఓ ఉద్యోగినితో పాటు ఆరుగురు విటులను అరెస్ట్ చేశారు. ముగ్గురు సెక్స్ వర్కర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. ఇక నిర్వాహకుల వద్ద నుండి రూ. 113450 నగదు ఓ ల్యాప్ టాప్ తొమ్మిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఆన్ లైన్ ద్వారా విటులను ఆకర్షించి ఈ వ్యవహారాన్ని నడుపుతునట్టు వారి ఫోన్ల ఆధారంగా గుర్తించారు పోలీసులు . హైదరాబాద్ లో ఈ తరహా దందాలు నిత్యకృత్యంగా మారాయి . పోలీసుల ఇలాంటి సెక్స్ రాకెట్ల గుట్టు రట్టు చేస్తున్నా ఈ దందా చేసేవారు విపరీతంగా పెరిగిపోతున్నారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications