పెద్దాయనను బఫూన్ అంటావా కుర్రకుంక.. కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై.. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. కేటీఆర్ ను ఉద్దేశించి కుర్రకుంకగా అభివర్ణించారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని అడిగితే.. కాంగ్రెస్ సీనియర్ లీడర్ వి.హనుమంతరావును బఫూన్ అంటూ ఆ కుర్రకుంక మాట్లాడటం సరికాదన్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే.. రాష్ట్రంలో ఎంతటి బలుపు పాలన కొనసాగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అందుకే వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు.

ఇంటర్మీడియట్ ఫలితాల తప్పిదాలపై గాంధీభవన్ దగ్గర కాంగ్రెస్ అనుబంధ సంస్థలైన యూత్ కాంగ్రెస్ విభాగం, ఎన్‌ఎస్‌యూఐ నేతలు 48 గంటల నిరసన దీక్ష చేపట్టారు. వారికి మద్దతు తెలిపిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇంటర్ ఫలితాల తప్పుల తడకపై అటు తండ్రి కేసీఆర్ గానీ, ఇటు కొడుకు కేటీఆర్ గానీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇద్దరు కలిసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

revanth reddy fires on ktr as he used buffoon word on VH

20 ఏళ్ల నుంచి ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థను తప్పించి గ్లోబరీనా సంస్థకు టెండర్ ఇవ్వడంలో ఆంతర్యమేంటని ధ్వజమెత్తారు. కేటీఆర్ స్నేహితుడి మామకు చెందిన మాగ్నటిక్ ఇన్ఫోటెక్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+