తెలుగు అకాడమీ కేసు: రూ.64 కోట్లను ఇలా పంచుకున్నారు.. రిమాండ్ రిపోర్ట్
తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు. రిమాండ్ రిపోర్టును ఇవాళ విడుదల చేశారు. తొమ్మిది పేజీల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాల ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే 10 మంది అరెస్ట్ చేశామని, రిమాండ్ రిపోర్టులో సీసీఎస్ పోలీసులు తెలిపారు. కీలక సూత్రదారి సాయికుమార్‌గా పోలీసులు తేల్చారు. కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్, భూపతి, యోహన్ రాజ్ పరారీలో ఉన్నారని తెలిపారు.

ఇలా పంచుకున్నారు..
భూపతి సాయంతో తెలుగు అకాడమీ డిపాజిట్లను యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యేలా సాయి కుమార్ చూశారని వివరించారు. ఏడాది నుంచి చేయాల్సిన డిపాజిట్లను పదిహేను రోజులకే ఈ ముఠా చేసిందని అన్నారు. కృష్ణారెడ్డి, పద్మనాభన్, మదన్‌లు డిపాజిట్ పత్రాలను ఫోర్జరీ చేసినట్లు పేర్కొన్నారు. 64.5 కోట్లను కొల్లగొట్టి నిందితులు వాటాలు పంచుకున్నారని, 20 కోట్లు సాయి కుమార్, 7 కోట్లు వేంకటరమణ, 3 కోట్లు రాజ్ కుమార్, 3 కోట్లు వేంకటేశ్వర్ రావు, 6 కోట్లు కృష్ణారెడ్డి, 2.5 కోట్లు భూపతి, 6 కోట్లు రమణా రెడ్డి, 50 లక్షలు పద్మనాభన్, 30 లక్షలు మదన్, 10 కోట్లు సత్యనారాయణ, 2.5 కోట్లు మస్తాన్ వలీ, 2 కోట్లు కెనరా బ్యాంకు మేనేజర్ సాధన, 50 లక్షలు యోహన్ రాజు తీసుకున్నారని తెలిపారు.

కస్టడీకి కావాలి..
నిందితులు సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని, కస్టడీకి తీసుకొని విచారించాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా పరారీ నిందితుల కోసం గాలిస్తున్నామని సీసీఎస్ పోలీసులు రిమాండ్ రిపోర్టు వివరించారు. అంతకుముందే తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ వాస్తవమేనని.. త్రిసభ్య కమిటీ తేల్చింది. నిధుల గల్లంతుపై.. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అకాడమీలో అందరినీ విచారించిన కమిటీ సభ్యులు.. ఫైనల్ రిపోర్టును రూపొందించారు. డబ్బులు ఎలా బయటికి వెళ్లాయి..? నిధుల గోల్‌మాల్‌లో ఎవరెవరు ఉన్నారు..? వారి పేర్లతో సహా రిపోర్టులో పేర్కొన్నారు. 64 కోట్ల కుంభకోణం జరిగినట్లు గుర్తించిన త్రిసభ్య కమిటీ.. ఇక మీదట రెగ్యులర్ అకౌంట్స్ ఆఫీసర్‌తోపాటు రెగ్యులర్ డైరెక్టర్ ఉండాలని నివేదిక ఇచ్చింది.
Recommended Video

నెగ్లిజెన్సీ వల్లే
ఇదివరకు డైరెక్టర్‌గా పనిచేసిన సత్యనారాయణ, మొన్నటివరకు డైరెక్టర్‌గా ఉన్న సోమిరెడ్డి నిర్లక్ష్యం వల్ల అవకతవకలు జరిగాయని.. వారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. అకాడమీకి ఉన్న మూడు అకౌంట్ల నుంచి నిధులు దారి మళ్లాయని.. మరో 31 అకౌంట్లలో నిధులు సేఫ్‌గానే ఉన్నట్లు త్రిసభ్య కమిటీ తేల్చింది. 22 పేజీల నివేదికను సమర్పించింది. త్రిసభ్య కమిటీ రిపోర్టు ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications