హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూల్ ఈజ్ రూల్ .. నిబంధనలకు విరుద్ధంగా తలసాని ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ ఫైర్ .. 25 వేలు జరిమానా

|
Google Oneindia TeluguNews

రూల్ ఈజ్ రూల్ .. రూల్ ఫర్ ఆల్ అంటున్నారు జీహెచ్ ఎంసీ అధికారులు. అధికార పార్టీ కి చెందిన మంత్రి అయినా సరే నిబంధనలు పాటించకుంటే వదిలేదే లేదు అని చెప్తున్నారు. హైదరాబాదులో నిబంధనలకు విరుద్ధంగా మంత్రి తలసాని ఫ్లెక్సీలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీహెచ్ఎంసీ కొరడా ఝులిపించింది. 25 వేల జరిమానా విధించి, ఆ ఫ్లెక్సీలను తొలగించింది. మార్చి 8న మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన అభిమానులు, అనుచరులు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పశుసంవర్ధక శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి అయినప్పటికీ తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలోనూ జిహెచ్ఎంసి కఠిన నిర్ణయం తీసుకుంది.

ఎర్రబెల్లికి ఏపీ మంత్రులు టచ్ లో ఉన్నారా ? ఆ విషయం వారే చెప్పారా ?ఎర్రబెల్లికి ఏపీ మంత్రులు టచ్ లో ఉన్నారా ? ఆ విషయం వారే చెప్పారా ?

గతంలో కేటీఆర్ సైతం సొంత పార్టీలోని కార్పొరేటర్లకు నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని సూచించారు. అలా నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారికి జరిమానా విధించి రూల్స్ అతిక్రమిస్తే ఎవరైనా ఒకటే అని తేల్చి చెప్పారు. ఇక తాజాగా తలసాని ఫ్లెక్సీల విషయంలోనూ జిహెచ్ఎంసి అధికారులు దాన్నే ఫాలో అయ్యారు.

Talasani
English summary
"Rule is rule rule for all. One of the followers of Minister Talasani srinivas Yadav garu erected illegal flex near secretariat and we have imposed fine of Rs.25,000/" this is the statement of the GHMC officials . On the occasion of taking charge as aminister talasani followers kept felx on the road side of secretariat. The GHMC officials imposed fine to them and the banners were removed .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X