సినీనటి సమంత నటించిన ఆ యాడ్ పై సానియా మీర్జా సుదీర్ఘ పోస్ట్ !!
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సినీనటి సమంత నటించిన ఒక యాడ్ పై స్పందించారు.తాజాగా సినీనటి సమంత ఒక యాడ్ లో నటించారు. ఆ యాడ్ లో ఆమె చుట్టుపక్కల వ్యక్తులు మహిళలు ధరించే దుస్తులు,మహిళలు తమ జీవితంలో భాగస్వామి ఎంపిక చేసుకోవడం వంటి అనేక విషయాలలో తమ అభిప్రాయాన్ని రుద్దడానికి ప్రయత్నించినా ,వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చినవిధంగా స్వతంత్రంగా జీవించాలన్నట్టు యాడ్ చేసింది.
దీంతో సినీనటి సమంత యాక్ట్ చేసిన తనకు నచ్చిన విధంగా జీవించాలి అనుకుంటున్నట్టు ఉన్న యాడ్ విషయంలో స్పందించిన సానియామీర్జా ఒక మహిళగా తన అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ ను చేశారు. సమంత నటించిన యాడ్ చూసిన తర్వాత తన చుట్టూ ఎన్నో జ్ఞాపకాలు చుట్టుముట్టాయని,ఒక టెన్నిస్ క్రీడాకారిణిగా తాను ఎదుర్కొన్న ప్రతికూలతలను గురించి సానియా మీర్జా చెప్పారు.

ఒక మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఏం సాధిస్తుంది? టెన్నిస్ మహిళలు ఆడే ఆట కాదు ఈ ఆటలో ఆమె ఎంత దూరం ప్రయాణం చేయగలుగుతుంది? వంటి అనేక ప్రశ్నలను సమాజం తన ముందు ఉంచిందని, అయినప్పటికీ తాను తన కలను అనుసరించి,తనను తాను నమ్ముకుని, సమాజ అభిప్రాయాలు పట్టించుకోకుండా ముందుకు నడిచానని పేర్కొన్నారు.
విజయం సాధించాలి అనే సంకల్పం ముందు తనపై జరిగిన చెడు వ్యాఖ్యానాలు,తన ముందు ఎంతోమంది ఉంచిన సందేహాలు తొలగిపోయాయని సానియా మీర్జా చెప్పారు. సినీనటి సమంత చేసిన ఈ యాడ్ మహిళలకు ఒక ప్రేరణగా నిలుస్తుంది అని,తనలాగా కలలను సాకారం చేసుకోవాలనే మహిళలకు ఇది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని సానియా మీర్జా పేర్కొన్నారు.
టెన్నిస్ క్రీడాకారిణిగా సానియా మీర్జా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆమె టెన్నిస్ ఆడే సమయంలో వేసుకునే డ్రస్ ల విషయంలో కూడా తీవ్రమైన అభ్యంతరాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తరచూ సానియా మీర్జా వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేవారు. వాటిని అధిగమిస్తూ టెన్నిస్ స్టార్ గా సానియా మీర్జా దూసుకుపోయింది.












Click it and Unblock the Notifications