స్కూల్స్ స్టార్ట్: ఎగ్జామ్స్ కూడా.. విద్యాశాఖ క్లారిటీ
కరోనా వైరస్ వల్ల మూతపడిన విద్యాసంస్థలను తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. విడతల వారీగా తరగతులను ప్రారంభించే యోచనలో విద్యాశాఖ ఉందని విశ్వసనీయంగా తెలిసింది. 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధన ప్రారంభించే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాల్లో పాఠశాలలు తెరిచేందుకు అమలు చేస్తోన్న విధానాలపై కేస్ స్టడీ చేస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను నిర్వహించే యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. రెండు మూడు రోజుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే ఫస్ట్ ఇయర్ విద్యార్థులను పై తరగతులకు ప్రభుత్వం ప్రమోట్ చేశారు. ప్రమోట్ అయిన ప్రతి సెకండ్ ఇయర్ విద్యార్థి మళ్ళీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయాల్సిందే. సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు అయినా ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగా పాస్ చేయచ్చనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.

విద్యాభివృద్ది కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల ప్రభుత్వ విద్యపై విద్యార్థులకు నమ్మకం పెరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇంటర్మీడియట్‌లో గణనీయంగా అడ్మిషన్లు పెరిగాయని వివరించారు. 52 వేలు ఉన్న విద్యార్థుల సంఖ్య 1.9 లక్షలు దాటిందని చెప్పారు. ఇంటర్ విద్యలో సంస్కరణలు అమలు చేశామని తెలిపారు. ప్రతి ఐదేళ్లకొకసారి సబ్జెక్ట్ రివైజ్ చేశామన్నారు. సెకండియర్ తెలుగు, ఫస్టియర్ ఇంగ్లీష్ పాఠ్యాంశాలను రివైజ్ చేశామన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఉచిత పుస్తకాలకు 9 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications