Pushpa-2: సంధ్య థియేటర్ వద్ద ఉద్రిక్తత.. ఇంకా స్పందించని అల్లు అర్జున్..!
పుష్ప2 సినిమా వారి కుటుంబంలో విషాదం నింపింది. ఫ్యామిలీతో కలిసి సరదాగా మూవీ చూసేందుకు వచ్చిన వారు ఒకరు మృతి చెందగా.. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ వస్తుంది. రేవతి ఫ్యామిలీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ ముందు ఎస్ఎఫ్ఐ , డివైఎఫ్ఐ, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.
వారిని వ్యాన్లలో అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని ఎస్ఎఫ్ఐ , డివైఎఫ్ఐ, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. సంధ్య థియేటర్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు కోరాయి. దీంతో అల్లు అర్జున్న పై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దిల్షుఖ్ నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్ , ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప2 ప్రీమియర్ షో చూడటానికి డిసెంబర్ 4న ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mm కు వచ్చారు.

అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వెళ్లారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి , ఆమె కొడుకు శ్రీ తేజ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. పోలీసులు వారికి వెంటనే పీసీఆర్ చేశారు. అయినప్పటికీ వారు స్పృహాలోకి రాలేదు. వారిని
వెంటనే పోలీసులు విద్య నగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా మారడంతో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై అల్లు అర్జున్ పెద్ద మనస్సుతో స్పందించి సాయం చేయాలని చాలా మంది సోషల్ మీడియాలో కోరుతున్నారు. మరి కొంత మంది రాత్రి ఫ్యామిలీతో సినిమా చూడడానికి వెళ్లడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications