Apsara: సీరియల్‌లో నటించాలని వచ్చి.. సెప్టిక్ ట్యాంకులో శవమైంది, ట్విస్టులు ఇలా
హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన అప్సర అనే యువతి దారుణ హత్య కేసుకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగానే యువతిని పూజారిగా పనిచేస్తున్న వెంకటసాయి కృష్ణ హతమార్చాడని తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన కీలక విషయాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి శుక్రవారం సాయంత్రం మీడియాకు తెలిపారు.
ఈ కేసులో నిందితుడు వెంకటసాయి కృష్ణ మరో మహిళతో వచ్చి అప్సర కనిపించడం లేదని శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమెను జూన్ 3 తేదీన భద్రాచలం వెళ్లేందుకు వాహనం ఎక్కించామని.. ఆ తర్వాత ఆమె నుంచి స్పందన లేదని, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంకటసాయికృష్ణతో వచ్చిన మహిళ అప్సర తల్లిగా గుర్తించామని డీసీపీ తెలిపారు.

అయితే, ఫిర్యాదు సమయంలో వారిద్దరి వ్యాఖ్యలకు పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిందన్నారు. సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా.. సాయికృష్ణ, అప్సర కారులో నర్కుడ వైపు వెళ్లినట్లు తెలిసింది. ముందు సీట్లో అప్సర నిద్రించిన సమయంలో కారుకు కప్పే కవర్‌తో ఆమెకు ఊపిరాడకుండా చేసి హత్య చేసేందుకు యత్నించాడు. ఆమె ఎదురు తిరగడంతో బండరాయితో దాడి చేశాడు సాయికృష్ణ. తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన తర్వాత ఆమె శవాన్ని కారుకు కప్పే కవర్లో చుట్టేసి డిక్కీలో కుక్కేశాడు.
అనంతరం అప్సర మృతదేహాన్ని సరూర్‌నగర్ తీసుకొచ్చి.. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద మ్యాన్‌హోల్‌లో పడేశాడు. సరూర్‌నగర్ వద్ద సెప్టిక్ ట్యాంక్ సమీపంలో మట్టి పోయించి అనుమానం రాకుండా వెంకటసాయికృష్ణ వ్యవహరించే ప్రయత్నం చేశాడని డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు.

ఇక అప్సర విషయానికొస్తే.. సీరియల్‌లో నటించేందుకు చెన్నై నుంచి అప్సర హైదరాబాద్‌కు వచ్చినట్లు డీసీపీ తెలిపారు. తన సోదరి వద్ద ఉంటూ ప్రయత్నాలు చేస్తుండేదని.. ఈ క్రమంలో బంగారు మైసమ్మ ఆలయానికి వస్తుండగా పూజారీ సాయికృష్ణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇది క్రమంగా వారి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసిందని చెప్పారు. సాంకేతిక వివరాలు సీసీ కెమెరాలు దృశ్యాలు, మొబైల్ ఫోన్లోని వివరాల ఆధారంగా హత్య కేసును ఛేదించినట్లు తెలిపారు.
పెళ్లి చేసుకోవాలని కోరడంతో.. అప్సరను వదించుకోవాలనే ఉద్దేశంతోనే నిందితుడు సాయికృష్ణ ఆమెను హత్య చేసినట్లు ప్రాథమికంగా తేలింది. సాంకేతికంగా వివరాలను పరిశీలించగా.. అతడొక్కడే హత్యకు పాల్పడినట్లు తేలింది. అప్సర కోయంబత్తూరుకు వెళ్తున్నట్లు తన ఇంట్లో చెప్పిందని.. ఆ తర్వాత సాయికృష్ణ ఆమెను శంషాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తిప్పి సుల్తాన్‌పూర్ తీసుకొచ్చి అంతమొందించినట్లు దర్యాప్తులో తేలిందని డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు.
పక్కా ప్లాన్ ప్రకారమే అప్సరను హత్య చేశాడని చెప్పారు. అప్సర గతంలో గర్బం దాల్చిందని.. దీంతో ఆమెకు అబార్షన్ కూడా చేయించినట్లు తేలింది. ఈ విషయంలో మరింత లోతుగా విచారణ జరుపుతున్నామిన డీసీపీ తెలిపారు. నిందితుడు సాయికృష్ణను పోలీస్ కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారిస్తామన్నారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications