ఎట్టకేలకు శిల్ప చౌదరీ బెయిల్.. కానీ కండీషన్స్ ఆప్లై..

కిట్టీ పార్టీలు, పెట్టుబడుల పేరుతో కోట్లు కొల్లగొట్టిన కీలేడీ శిల్ప చౌదరికి బెయిల్ వచ్చింది. పలుమార్లు బెయిల్ పిటిషన్‌లను కోర్టులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇవాళ రాజేంద్రనగర్ కోర్టు శిల్ప చౌదరికి షరుతులతో కుడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రతి శనివారం నార్సింగి పోలీస్టేషన్‌లో హజరై సంతకం చేయాలనే నిబంధనతో బెయిల్ మంజూరైంది.

ష్యూరిటీ..

ష్యూరిటీ..

రూ. 10వేల చొప్పున షురిటీ కోర్టుకు సమర్పించాలని కోరింది. సమాచారం లేకుండా విదేశీ ప్రయాణం చేయొద్దని కూడా నిబంధన విధించింది. ఎవరితో ఫోన్‌లో కానీ, డైరెక్ట్‌‍గా కానీ, కేసు విషయం మాట్లాడకూడదని, సాక్షులను బెదిరించరాదని కోర్టు ఆదేశించింది. బెయిల్ మంజూరు కావడంతో శిల్ప చౌదరి రేపు మధ్యాహ్నం విడుదల కానుంది. చిట్టీలు మొదలు కిట్టీ పార్టీల వరకు అనేక రంగాల్లో వేలు పెట్టిన శిల్పపై పెద్ద మొత్తాల్లో తమకు డబ్బులు చెల్లించాలని చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైఫై లైఫ్

హైఫై లైఫ్

శిల్ప చౌదరి హై ఫై లైఫ్ ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. సంపన్నుల దగ్గర నుంచి వడ్డీ రూపంలో డబ్బులు తీసుకొని జల్సాలు చేసింది. దివినోస్ క్లబ్ పేరుతో కిట్టి పార్టీలను ఏర్పాటు చేసిన శిల్ప వీఐపీలను ఆకట్టుకుంది. వారిని బుట్టలో పడేసుకుంది. కిట్టి పార్టీలకు హీరో హీరోయిన్లను ఆహ్వానించేవారు. సంపన్నులను ప్రసన్నం చేసుకున్న శిల్ప దివినోస్ క్లబ్ ప్రారంభోత్సవానికి ఏకంగా ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని ముఖ్య అతిథిగా పిలిచింది.

 ఫలక్ నుమా ప్యాలెస్

ఫలక్ నుమా ప్యాలెస్

హైదరాబాద్‌లో ఖరీదైన ఫలక్ నుమా ప్యాలెస్‌లో క్లబ్ ఉత్సవాలు నిర్వహించారు. హైఫై పార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి 200 మంది వీఐపీలకు చెందిన భార్యలు హాజరయ్యారు. పార్టీలో క్యాట్ వాక్‌తోపాటు హై పై పార్టీ లు ఏర్పాటుచేసింది. ఫలక్ నుమాలో రెండు రోజులపాటు సెలబ్రేషన్ నిర్వహించింది. తన పార్టనర్‌తో కలిపి పెద్దఎత్తున పార్టీ నిర్వహించిన వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ పార్టీకి లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎస్‌వోటీ కార్యాలయం నుండి కోకాపేట యాక్సిస్ బ్యాంక్‌కి తీసుకెళ్లిన నార్సింగి పోలీసులు ఆమె సమక్షంలో బ్యాంక్ అకౌంట్ల లాకర్లను తీసి వాటి గురించి కూపీ లాగారు. ఈ కేసు విచారణ సుధీర్ఘంగా సాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+