సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం వందల సంఖ్యలో రైళ్లు నడుస్తుంటాయి. హైదరాబాద్, కాచిగూడ నుంచి రైళ్లు తిప్పుతున్నప్పటికీ రద్దీని నియంత్రించడం కష్టమవుతుండటంతో కొత్తగా అధికారులు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను అత్యాధునిక హంగులతో సిద్ధం చేసి త్వరలోనే అందుబాటులోకి తేబోతున్నారు. ఇది ప్రారంభమైతే సికింద్రాబాద్, హైదరాబాద్ పై ఒత్తిడి తగ్గుతుంది. లింగంపల్లి నుంచి నడిచే రైళ్లు సికింద్రాబాద్ వచ్చే అవసరం లేకుండా సనత్ నగర్ నుంచి మౌలాలి మీదుగా చర్లపల్లికి మళ్లిస్తారు. తాజాగా అధికారులు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. ప్రస్తుతం తిరిగేవాటిని మరికొంతకాలం పొడిగించారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
పాట్నా-సికింద్రాబాద్ (03253) - ప్రతి సోమ, బుధవారం - ఆగస్టు 5 నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.
హైదరాబాద్-పాట్నా (07255) - ప్రతి బుధవారం - ఆగస్టు 7 నుంచి అక్టోబరు 2 వరకు నడుస్తుంది.
సికింద్రాబాద్ -పాట్నా (07256) - ప్రతి శుక్రవారం - ఆగస్టు 8 నుంచి సెప్టెంబరు 27 వరకు నడుస్తుంది.
దానాపూర్-సికింద్రాబాద్ (03225) ప్రతి గురువారం - ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 26 వరకు నడుస్తుంది.
సికింద్రాబాద్-దానాపూర్ (03226) - ప్రతి ఆదివారం - ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 29 వరకు నడుస్తుంది.
అహ్మదాబాద్-తిరుచిరాపల్లి (09419)-ప్రతి గురువారం - జులై 25 నుంచి ఆగస్టు 15 వరకు నడుస్తుంది.
తిరుచిరాపల్లి-అహ్మదాబాద్ (09420) - ప్రతి ఆదివారం - జులై 28 నుంచి ఆగస్టు 18 వరకు నడుస్తుంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే వందే భారత్ రైళ్లను, వందే సాధారణ్ రైళ్లను తీసుకువస్తోంది. వందే భారత్ పూర్తి ఏసీ రైళ్లు కాగా, వందే సాధారణ్ పూర్తి నాన్ ఏసీ రైళ్లు. అహ్మదాబాద్ నుంచి ముంబయి వరకు నిర్మాణం జరుగుతున్న భారతదేశ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు 2026కు పూర్తికాబోతున్నాయి. అదే సంవత్సరం బుల్లెట్ రైలు పట్టాలెక్కి భారతీయుల కలలను నిజం చేయబోతోంది.












Click it and Unblock the Notifications