శ్రీ రెడ్డికి ఏమైంది.. అనారోగ్య సమస్యలా..? సోషల్ మీడియాకు దూరం.. ఎందుకంటే..
శ్రీ రెడ్డి అంటేనే సెన్సేషనల్.. కాస్టింగ్ కౌచ్ పేరుతో ఒక్కసారిగి వార్తల్లోకి వచ్చారు. తర్వాత టాప్ హీరోలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. సినిమా అవకాశాలు అంతంతమాత్రమే కావడంతో యూట్యూబ్ చానెల్ కూడా పెట్టారు. దాంతో ఏదో అలా నెట్టుకు వస్తున్నారు. అయితే ఇటీవల శ్రీ రెడ్డి సైలంట్ అయిపోయారు. దీంతో ఆమెకు ఏం జరిగిందనే సందేహాలు తలెత్తాయి. ఇంతకీ శ్రీ రెడ్డికి ఏం జరిగింది.. అనారోగ్య సమస్యలా.... ఇతర ప్రాబ్లమ్సా..? ఏం జరిగింది. ఇంతకీ శృంగార తార ఏం చెప్పింది.

కాంట్రవర్సీ కామెంట్స్..
వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యే శ్రీరెడ్డి.. గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయారు. కరెంట్ ఇష్యూస్‌తోపాటు.. హాట్ ట్రీట్‌తో ఫేస్ బుక్‌ని హీటెక్కించే శ్రీరెడ్డి ఫేస్ బుక్‌లో జూలై 12న చివరి పోస్ట్ పెట్టింది. నెల రోజులుగా ఆమె ఫేస్ బుక్‌లో పోస్ట్ లేకపోవడంతో పాటు.. ఆమె యూట్యూబ్ ఛానల్‌లో కూడా సైటెంట్ అయిపోయారు. కత్తి మహేష్ మరణించిన సమయంలో దిగ్భాంతి వ్యక్తం చేస్తూ తనదైన శైలిలో పోస్ట్ పెట్టింది. ఆ తరువాత ఆమె ఫేస్ బుక్‌లో ఒకే ఒక్క ఫొటోని షేర్ చేసింది. ఆ తరువాత శ్రీరెడ్డి ఫేస్ బుక్‌లో కనిపించడం మానేయడంతో ఆమె అనారోగ్యానికి గురైందంటూ వార్తలు వచ్చాయి.

అబ్బే లేదే..
శ్రీరెడ్డి కరోనా బారిన పడిందని.. తీవ్ర అనారోగ్యంతో హాస్పటల్‌లో చికిత్స పొందుతుందని పలు వార్తలు వచ్చాయి. వీటిపై శ్రీ రెడ్డి స్పందించారు. తనకు హెల్త్ ఇష్యూస్ ఉన్న మాట నిజమే అని చెప్పిన శ్రీరెడ్డి.. కరోనా బారిన పడలేదని వివరణ ఇచ్చారు. ఫేస్ బుక్‌కి దూరం కావడానికి కరోనా కారణం కాదు.. డిప్రెషన్ ఎక్కువైపోవడంతో డాక్టర్‌ని సంప్రదించాల్సి వచ్చింది. ట్రీట్‌మెంట్ తీసుకున్నా.. అందుకే ఫేస్ బుక్‌లో యాక్టివ్‌గా లేను. చెన్నైలో ఇల్లు మారడం.. ట్యాబ్లెట్స్ వాడటం వల్ల సోషల్ మీడియాకి దూరంగా ఉన్నానని వివరించారు.

సిటీకి కూడా వచ్చి
ఆ మధ్యలో హైదరాబాద్‌కి కూడా వచ్చాను.. ట్రీట్ మెంట్ తీసుకుంటున్నా.. నాకు జబ్బులు దాచుకోవాల్సిన అవసరం లేదన్నారు శ్రీ రెడ్డి. ఈ డిప్రెషన్ అనే ప్రాబ్లమ్ వల్ల లాక్ డౌన్‌లో చాలామంది బాధపడుతున్నారు. ఫైనాన్సియల్‌గా కూడా చాలామంది బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల నుంచి నాతో పాటు అందరూ బయటపడాలని కోరుకుంటున్నా అని శ్రీ రెడ్డి చెప్పారు. ఇప్పుడైతే ఫేస్ బుక్‌కి దూరంగా ఉన్నాను కానీ.. యూట్యూబ్‌కి సంబంధించి కొన్ని వీడియోలు బ్యాకప్ చేస్తున్నా.. వరుసగా వీడియోలను రిలీజ్ చేస్తానని క్లారిటీ ఇచ్చారు శ్రీరెడ్డి.

కరోనా కల్లోలం..
ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
Recommended Video

ఫంగస్ బెడద
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం










Click it and Unblock the Notifications