video:కర్రీలో గాజు పెంక, వీసీ, సీఎం దుమ్ముదులిపిన విద్యార్థి, వీడియో
హాస్టల్ ఫుడ్‌లో ఒకప్పుడు పురుగులు కనిపించేవి. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో ఆ స్థితి వెళ్లింది. ఇక క్యాంపస్ అంటే మంచి భోజనం.. ఓయూ క్యాంపస్ అంటే పెట్టింది పేరు.. కానీ అక్కడ కూడా ఫుడ్ గురించి ఫిర్యాదులు వస్తున్నాయి. విద్యార్థినీలు ఆహారం గురించి కంప్లైంట్ చేశారు.
ఉస్మానియా వర్సిటీ హాస్టల్‌లో విద్యార్థులకు వడ్డించిన చికెన్ కర్రీలో గాజు పెంకులు కనిపించాయి. ఈ మేరకు స్టూడెంట్స్ వాపోయారు. ఆ ఘటనపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఆందోళనకు దిగిన విద్యార్థినుల వీడియోను ట్వీట్ చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి ప్రశ్నలు వేశారు.

అన్నం గడ్డలుగా ఉందని, గాజు పెంకులు వచ్చాయని పేర్కొన్నారు. వీటికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.ఇవి కూడా సిల్లీ రీజన్సే అవుతాయా? అని ప్రశ్నించారు. మీ సీఎం మనవడు తినే భోజనమే వీరికీ పెడుతున్నారా? అని నిలదీశారు.ట్వీట్‌ను మంత్రి సబిత, తెలంగాణ సీఎంవోకు ట్యాగ్ చేశారు.
అన్నం గడ్డలుగా, గాజు పెంకులు వచ్చిన భోజనం !
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) September 12, 2022
ఏం అమ్మ సబితమ్మ @SabithaindraTRS ఇవి కూడా సిల్లీ రీజన్స్ ఏ ఐతయా ?
మీ సీఎం మనవడు తినే భోజనమే ఈ పిల్లలకు కూడా పెడుతున్నారా ? @TelanganaCMO pic.twitter.com/dUBHuVzR87
గాజు పెంకులు వచ్చిన ఘటనపై విద్యార్థినులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. గాజు పెంకులు కనిపించే సరికే చాలా వరకు అన్నం తిన్నామని, తమలో ఎవరికైనా ఏమైనా జరిగితే ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే బలంగా ఉండాలని స్పీచ్‌లు ఇవ్వడం కాదని, వారికి ఏం పెడుతున్నామో? ఎలాంటి ఆహారం పెడుతున్నామో కూడా చూడాలని అన్నారు. ఓ విద్యార్థిని వీసీని, సీఎం కేసీఆర్‌ను దుమ్ము దులిపేశారు.












Click it and Unblock the Notifications