ఉస్మానియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.!పారిశుద్ధ్య చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మేయర్.!
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు ఉదృతంగా నిర్వహిస్తున్నారు. మొన్నటివరకూ మున్సిపల్ పరిధిలో జోన్ల వారీగా పారిశుద్య పనులను ఆకస్మిక తనిఖీ చేసిన మేయర్ విజయలక్ష్మీ నేడు వేకువజామున ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు.ఉదయం ఆరు గంటలకు మొదలైన మేయర్ పర్యటన ఉస్మానియా ఆసుపత్రి నలుమూలల కొనసాగింది. ఆసుపత్రి వద్ద ఐదు రూపాయల బోజనం కౌంటర్ వద్ద పేరుకుపోయిన చెత్తను చూసి వెంటనే తీసి వేయాలని ఆదేశించారు. అక్కడ భోజన కౌంటర్ హాస్పిటల్ కు ఇబ్బందిగా ఉండడం గమనించిన మేయర్ అక్కడ అన్నపూర్ణ కాంటీన్ కౌంటర్ ను మరోచోటికి తరలించాలని ఆదేశించారు.

కొనసాగుతున్న మేయర్ తనిఖీలు..
హాస్పిటల్ లోపల ఏఎమ్ఓహెచ్ మరియు ఆర్ఎమ్ఓ లతో కలసి సందర్శించారు మేయర్. లోపల బాగం చాలా చోట్ల పారిశుద్ధ్య లోపాలను గమనించిన మేయర్ సిబ్బందిని పిలిచి మొత్తం శుభ్రపరచాలని ఆదేశించారు. వైద్య వ్యర్దాలను గమనించిన మేయర్ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు.
అక్కడ ఉన్న పేషెంట్ లతో మాట్లాడిన మేయర్ కరొన పాజిటీవ్ వచ్చిన పేషెంట్ లను గాంధీ ఆసుప్రికి తరలించే విదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వార్డు, ఆపరేషన్ థియేటర్ మరియు మార్చురీ సమస్యలను మేయర్ దృష్టికి రాగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

ఎక్కడా చూసినా ఏంటి ఈ చెత్త..
జియగూడ రోడ్డులో మూసి పక్కన పేరుకుపోయిన చెత్తను చూసిన మేయర్ వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఎదురుగా చార్మినార్ జోన్ లో కూడా శ్మశాన వాటిక వద్ద ఉన్న చెత్తను కూడా తొలగించాలని మేయర్ ఆదేశించారు. లంగర్ హౌస్, గోల్కొండ, ఏరియాలలో పారిశుద్ధ్యంపై తనిఖీలు నిర్వహించిన మేయర్ అక్కడ కొన్ని ప్రదేశాలలో చెత్తను చూసి తొలగించాలని ఆదేశించారు. జియగూడ లో సీటిపి ప్లాంట్ వద్ద చెత్తను డంప్ చేయడం చూసిన మేయర్ ఆటోల చెత్తతో పాటు ఆ చెత్తను కూడా సీటీపి ప్లాంట్ ద్వారానే చేయాలని, జవహర్ నగర్ ఎందుకు పంపుతున్నారని మేయర్ ప్రశ్నించగా ఏడు రోజుల్లో చెత్తను లేకుండా సీటీపి ద్వారానే చేరవేస్తామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

చారిత్రక నిర్మాణాలకు ఆటంకం కలిగించొద్దు..
ట్విటర్ లో మోతి దర్వాజ దగ్గర చెత్త పేరుకుపోయిన కంప్లయింట్ చూసి అక్కడకు వెళ్ళిన మేయర్ మోతి దర్వాజ దగ్గర నాలలో చెత్తను చూసి వెంటనే తొలగించాలని ఆదేశించి, అలాగే అక్కడ కూలిన గోడను వెంటనే నిర్మించే విధంగా చర్యలు తీసుకోవడమే కాకుండా చారిత్రక నిర్మాణాలకు ఆటంకం కాకుండా చూస్తామని తెలిపారు. నగరంలో పారిశుద్ధ్య పనులు బాగా జరుగుతున్నాయని, ప్రజలు కూడా తమ వంతుగా చెత్తను ఓపెన్ పాయింట్ లలో వేయకుండా ఆటోలకు మాత్రమే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు మంచి స్పందన..
జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ లో ఆకస్మిక తనికి నిర్వహించిన మేయర్ అక్కడ వచ్చే కాల్స్ గురించి అడిగి తెలుసకున్నారు. నిన్న ఒక్కరోజు లో 61 ఫోన్ కాల్స్ ద్వారా 6 గురు ఆయుష్ డాక్టర్ లు, 19 మందికి మెడికల్ సపోర్ట్ ఇచ్చారని, అలాగే 15 మందికి కిట్ లు పంపండం జరిగిందని, వ్యాక్సినేషన్ గురించి 21 మంది ఫోన్ కాల్స్ వచ్చాయని కంట్రోల్ రూమ్ సిబ్బంది మేయర్ కి తెలియచేసారు. నగరంలో నేటి నుండి 2 వ డోసు వ్యాక్సినేషన్ పంపిణీ జరుతుందని అలాగే బెడ్ లు కావాలని ఎవరు కాల్ చేసినా నెంబర్ ఇవ్వడం కాకుండా వారికి బెడ్ ఇప్పించే విధంగా కంట్రోల్ రూమ్ వారు జొరవచూపాలని మేయర్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications