Sunny Leone: సన్నీలియోన్ కోసం ఎగబడిన జనం.. అర్ధరాత్రి హంగామా..!
హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లోని ఇల్యూజన్ పబ్‌లో బాలీవుడ్ నటి సన్నీలియోన్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ డిజే ఈవెంట్ పోలీసుల జోక్యంతో ఆపేశారు.
నవంబర్ 30 శనివారం రాత్రి ఇల్యూజన్ పబ్‌లో బాలీవుడ్ నటి సన్నీలియోన్ కార్యక్రమం ఉందని నిర్వాహకులు ప్రకటించారు. రాత్రి 11 గంటల నుంచి 12:30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. దీంతో బుక్‌మైషో ద్వారా టిక్కెట్లను అమ్మకానికి పెట్టాదు. దీంతో పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే ఈ కార్యక్రమానికి నిర్వాహకులు పోలీసుల అనుమతి కోరారు.
ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించలేదు. దీంతో ఈవెంట్ ఉంటుందని దాదాపు 500 మంది ఇల్యూజన్ పబ్ వద్దకు వచ్చారు. రాత్రి 8 గంటల నుంచి టికెట్లు బుక్ చేసుకున్న వారు రావడం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. నిర్వాహకులతో మాట్లాడారు. కార్యక్రమం నిర్వహిస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పారు. దీంతో చివరి నిమిషంలో నిర్వాహకులు కార్యక్రమాన్ని రద్దు చేశారు.

సన్నీ లియోన్ అనారోగ్యం కారణంగా ఈవెంట్ రద్దు చేస్తున్నట్లు వీడియో విడుదల చేశారు. దీంతో అక్కడి వచ్చిన వరకు నిరాశతో వెనుదిరిగారు. కాగా తమ టికెట్ల డబ్బులు రిఫండ్ చేయాలని డిమాండ్ చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా సుమారు 100 మంది పోలీసులు రాత్రి ఒంటి గంట వేదిక దగ్గరే ఉన్నారు. కార్యక్రమం జరగదని స్పష్టం చేశారు. ఈ మధ్య పోలీసులు పబ్ ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. పబ్ ల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పబ్ ల్లో రైడ్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పబ్ ల్లో ఎక్కువ సౌండ్ వాడడం, డ్రగ్స్ వాడకంపై పోలీసులు కఠినంగా ఉన్నారు. అలాగే డిసెంబర్ 31 కార్యక్రమాలు నిర్వహించేవారు అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు. డిసెంబర్ 15లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి చెప్పారు. https://cybpms.telangana.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. సైబరాబాద్ తో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ ఈవెంట్ ఏర్పాటు చేయాలన్నా అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications